AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: ఐటీ సోదాలపై స్పందించిన నిర్మాత దిల్‌ రాజు.. ఏమన్నారంటే..?

హైదరాబాద్‌లోని సినీ నిర్మాణ సంస్థల కార్యాలయాలు, వారి ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు రెండో రోజు బుధవారంకూడా సోదాలు కొనసాగిస్తున్నారు. సంక్రాంతి మూవీస్ బడ్జెట్, కలెక్షన్స్, వారు ఐటీ శాఖకు కట్టిన పన్నులపై అధికారులు ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు కార్యాలయంపై రెండో రోజు సోదాలు కొనసాగిస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. ఈ ఐటీ సోదాలపై దిల్ రాజు స్పందించారు.

Dil Raju: ఐటీ సోదాలపై స్పందించిన నిర్మాత దిల్‌ రాజు.. ఏమన్నారంటే..?
Dil Raju
Janardhan Veluru
|

Updated on: Jan 22, 2025 | 5:10 PM

Share

హైదరాబాద్‌ నగరంలోని టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ శాఖ అధికారుల దాడులు రెండో రోజు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. దిల్‌ రాజు నివాసాలు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీస్‌, మ్యాంగో మీడియా నిర్మాతలు, వారి కుటుంబీకులు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో భాగంగా బ్యాంకు లాకర్లను కూడా ఓపన్ చేసి తనిఖీలు చేస్తున్నారు.

కృష్ణానగర్‌లోని దిల్‌రాజు ఆఫీస్‌లో ఐటీ రెయిడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. దిల్‌రాజు ఇటీవల నిర్మించిన సినిమాల బడ్జెట్‌పై అధికారులు ఆరా తీశారు. చెల్లించిన ఆదాయపు పన్నుకు.. వస్తున్న రాబడులకు పొంతన లేకపోవడంపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. నిన్న దిల్‌రాజు భార్యతో బ్యాంక్‌ లాకర్లు తెరిపించిన అధికారులు.. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.

ఐటీ సోదాలపై సినీ నిర్మాత, తెలంగాణ FDC ఛైర్మన్‌ దిల్‌ రాజు స్పందించారు. ఐటీ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన.. మీడియా ప్రతినిధులకు అభివాదం చేశారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారంనాడు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్‌ సినిమాలు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండింటినీ దిల్ రాజు తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అలాగే పుష్ప 2 మూవీకి వచ్చిన కలెక్షన్స్‌పై ఐటీ శాఖ అధికారులు ఫోకస్ చేశారు. ప్రధానంగా ఈ మూడు చిత్రాల ప్రొడక్షన్ బడ్జెట్, ఆ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్, వారు ఐటీ శాఖకు కట్టిన పన్నులపై ఆ శాఖ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నారు.

సంక్రాంతి మూవీస్‌ కలెక్షన్ల పేరిట జరిగిన ప్రచారంతో వీటిపై ఐటీ శాఖ అధికారులు దృష్టిపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సినిమాలకు సంబంధించిన వారిపై ఇన్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ సోదాలు చేయడం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకరేపుతోంది.