
టాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ కసిరెడ్డి తన కెరీర్, ఇండస్ట్రీలోని తన రిలేషన్ల గురించి, ముఖ్యంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. సితార ప్రొడక్షన్స్ తన పట్ల చూపించిన ప్రత్యేక అభిమానం గురించి కసిరెడ్డి వివరించాడు. నాగవంశీ తన మొదటి సినిమా నుంచి కసిరెడ్డికి పెద్ద అభిమాని అని ప్రెస్ మీట్‌లో చెప్పారని, ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో అవకాశం లభించడం ఒక గొప్ప ప్రోత్సాహం అని పేర్కొన్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు కొత్త నటులను సినిమాల్లోకి తీసుకోవడం ఒక రకమైన బూస్ట్ లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’
నాగవంశీ వ్యక్తిగతంగా చాలా సున్నితమైన మనస్తత్వం కలవారని రాజ్‌కుమార్ కసిరెడ్డి వెల్లడించారు. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్‌లలో ఆయన దూకుడుగా కనిపించినా, లోపల ఏమీ దాచుకోరని, చాలా సానుకూలంగా ఉంటారని తెలిపారు. కోట్ల రూపాయల పెట్టుబడితో సినిమాలు నిర్మించేటప్పుడు ఎదురయ్యే ఒత్తిళ్లు, టెన్షన్ల వల్ల ఆయన మాటలు అప్పుడప్పుడు తప్పుగా అన్పిస్తాయని వివరించారు. సోషల్ మీడియా నెగటివిటీని త్వరగా వ్యాప్తి చేస్తాయని, నాగవంశీ సానుకూల కోణం చాలామందికి తెలియదని, ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడిన వారికే అది అర్థమవుతుందని కసిరెడ్డి స్పష్టం చేశారు. స్టేజి మీద మాట్లాడిన తర్వాత, దిగగానే ఏమి మాట్లాడారో కూడా ఆయనకు గుర్తుండదని, ఆయన వాటిని వదిలేస్తారని కసిరెడ్డి చెప్పారు.
‘లక్కీ భాస్కర్’ చిత్రంలో తనకు లభించిన ఫ్రెండ్ రోల్ ఒక జీవితకాల అచీవ్‌మెంట్ లాంటిదని, ఇలాంటి పాత్ర కోసమే ప్రతి నటుడు ఎదురు చూస్తారని కసిరెడ్డి పేర్కొన్నారు. ఈ పాత్ర తనను వెతుక్కుంటూ వచ్చిందని, దర్శకుడు వెంకీ అట్లూరి డేట్ల విషయంలో చాలా సాయం చేశారని, దానివల్లనే తాను ఆ సినిమా చేయగలిగానని గుర్తు చేసుకున్నారు.’తొలిప్రేమ’ తర్వాత వెంకీ అట్లూరి చిత్రాలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయని, తన ప్రయాణమే ఆయనకు అన్నీ నేర్పిందని కసిరెడ్డి అభిప్రాయపడ్డారు. వెంకీ అట్లూరి తనకున్న బలాన్ని గుర్తించి, తన ఫార్ములాను మార్చుకుని సినిమాలు చేస్తున్నారని తెలిపారు. ఆయనకు కార్లంటే విపరీతమైన పిచ్చి అని, హైదరాబాద్‌లోనే ఆయనకు 60 నుండి 70 కార్లు ఉన్నాయని, ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చని రాజ్‌కుమార్ కసిరెడ్డి ఆశ్చర్యంగా వెల్లడించారు. ఈ కార్లన్నీ స్నేహితుల వద్ద ఉంటాయని, ఆయన ఇంట్లో కూడా తెలియదని తెలిపారు.
ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..