Rajinikanth: ఆ సినిమాలో నేను సరిగ్గా నటించలేదని అన్నారు.. కమల్‏కు ఫోన్ చేయడంతో.. రజినీకాంత్..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. తాజాగా కూలీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ తారాగణం నటించింది.

Rajinikanth: ఆ సినిమాలో నేను సరిగ్గా నటించలేదని అన్నారు.. కమల్‏కు ఫోన్ చేయడంతో.. రజినీకాంత్..
Rajinikanth

Updated on: Aug 14, 2025 | 3:43 PM

సినీపరిశ్రమలో దశాబ్దాలుగా తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ కండక్టర్.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తలైవా స్టైల్, మేనరిజం అంటే యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. చివరగా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజినీ.. ఇప్పుడు కూలీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..

భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ సినిమాను ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు ఉదయం నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో రజినీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సినీరంగంలోని అగ్ర దర్శకులలో ఒకరైనా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సినిమా దళపతి. ఇందులో రజినీకాంత్, మమ్ముట్టి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

“దళపతి సినిమాలో రాజకీయ నాయకుడితో సవాలు విసిరే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఈ షాట్ చాలా బాగా రావాలని మణిరత్నం పట్టుపట్టారు.ఎన్నో టేక్స్ తీసిన కూడా నేను సరిగ్గా నటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో నేను నిరాశకు గురయ్యాను. నా స్నేహితుడు కమల్ హాసన్ కు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఇలాంటిది జరుగుతుందని ముందే తెలుసు.ఆ సన్నివేశంలో మణిరత్నాన్ని నటించి చూపించమను అన్నారు. ఆ విషయంలో మాత్రం కమల్ కు రుణపడి ఉంటాను” అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..