Pradeep Ranganathan: కొంప ముంచిన ‘లైక్‌’.. లవ్‌ టుడే హీరోపై ఆగ్రహంతో రగిలిపోతోన్న రజనీ ఫ్యాన్స్‌.. కారణమిదే!

|

Feb 03, 2023 | 4:40 PM

జయం రవితో ప్రదీప్‌ తెరకెక్కించిన మొదటి సినిమా కోమాలిలో రజనీ రాజకీయాల గురించి ప్రస్తావించారు. దీంతో తలైవా ఫ్యాన్స్‌ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రదీప్‌ సంజాయిషీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

Pradeep Ranganathan: కొంప ముంచిన లైక్‌.. లవ్‌ టుడే హీరోపై ఆగ్రహంతో రగిలిపోతోన్న రజనీ ఫ్యాన్స్‌.. కారణమిదే!
Pradeep Ranganathan
Follow us on

లవ్‌ టుడే సినిమాతో తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌. ఈ సినిమాకు అతనే డైరెక్టర్‌ కావడం విశేషం. యువత ఆలోచనలకు అద్దం పట్టేలా ప్రదీప్‌ తెరకెక్కించిన లవ్‌టుడే సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. సినిమాల సంగతి పక్కన పెడితే అప్పుడప్పుడు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు ప్రదీప్‌ రంగనాథన్‌. జయం రవితో ప్రదీప్‌ తెరకెక్కించిన మొదటి సినిమా కోమాలిలో రజనీ రాజకీయాల గురించి ప్రస్తావించారు. దీంతో తలైవా ఫ్యాన్స్‌ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రదీప్‌ సంజాయిషీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఆతర్వాత లవ్‌టుడే ఘన విజయం సాధించిన తర్వాత రజనీకాంత్‌ను ఇంటికెళ్లి కలిశాడు ప్రదీప్‌. ఈ సందర్భంగా యంగ్‌ హీరోను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు రజనీ. దీంతో ప్రదీప్‌- రజనీకాంత్ కాంబినేషన్‌లో సినిమా వస్తోందని వార్తలు సోషల్‌ మీడియాలో గుప్పుమన్నాయి. కొంతమంది నెటిజన్లు అయితే ఆ సినిమాకు ‘జాయింట్‌ జగదీశన్‌’ అని పేరు కూడా పెట్టేశారు.

ప్రస్తుతం జాయింట్‌ జగదీశన్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌, పోస్టర్లు తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మీమ్స్‌, పేరడీ పోస్టర్స్‌పై స్పందించిన ప్రదీప్‌.. వాటి గురించి తనకూ తెలుసన్నాడు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. ఈ వైరల్‌ మీమ్స్‌, పోస్టర్లకు ప్రదీప్‌ లైక్‌ కొట్టడం తప్పు అయింది. అదేంటంటే ఆ పోస్టర్లలో ‘రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ పిచ్చివాళ్లు’ అనే మాటలు కూడా ఉన్నాయి. దీంతో రజనీ ఫ్యాన్స్‌ ప్రదీప్‌పై మండిపడుతున్నారు. రజనీని, రజనీ అభిమానులను కించపరిచే విధంగా ఉన్న పోస్టులకు లైక్‌ ఎలా కొడతావంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై ప్రదీప్‌ ఇంకా స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..