Coolie Movie: అఫీషియల్.. విజయ్ రికార్డు బ్రేక్ చేసిన రజనీ.. కూలీ సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా గురువారం (ఆగస్టు 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ అప్పుడే కలెక్షన్లలో రికార్డులు బద్దలు కొడుతోంది. తాజాగా కూలీ మొదటి రోజు కలెక్షన్ల వివరాలను అధికారికంగా ప్రకటించింది సన్ పిక్చర్స్.

Coolie Movie: అఫీషియల్.. విజయ్ రికార్డు బ్రేక్ చేసిన రజనీ.. కూలీ సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Rajinikanth Coolie Movie

Updated on: Aug 15, 2025 | 6:34 PM

అనుకున్నట్లే రజనీ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా గురువారం (ఆగస్టు 14) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అప్పుడే రికార్డుల వేట షురూ చేసింది. రిలీజైన రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తమిళ్‌ సినిమాగా నిలిచింది. గురువారం ఈ సినిమా రూ.151+ కోట్లు (గ్రాస్‌) కలెక్షన్లు వచ్చాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా కలెక్షన్ల వివరాలు వెల్లడించింది. కాగా ఫస్ట్‌ డే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ్‌ సినిమాగా ఇప్పటి వరకూ విజయ్ దళపతి ‘లియో’ పేరిట ఉంది. ఈ సినిమా తొలి రోజు దాదాపు రూ.140 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసింది. ఇప్పుడు ఈ రికార్డును కూలీ సినిమా బద్దలు కొట్టింది. ఈ రెండు చిత్రాలను దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించినవే కావడం విశేషం. ఇక లియో తర్వాత
‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (రూ.100+ కోట్లు), రజనీ కాంత్ ‘2.O’ (రూ.100 కోట్లు) వరుస స్థానాల్లో ఉన్నాయి.

లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమాలో రజనీతో పాటు అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్, రచితా రామ్ వంటి స్టార్ యాక్టర్స్ వివిధ పాత్రలు పోషించారు. అలాగే పూజా హెగ్డే కూడా మోనికా పాటతో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. కాగా అడ్వాన్స్ బుకింగ్ లోనే కూలీ సినిమాకు రికార్డు వసూళ్లు దక్కాయి.ఈతిడూ ఓవర్సీస్‌లో.. ప్రీ బుకింగ్స్‌లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తమిళ్‌ సినిమాగా రికార్డు నెలకొల్పింది.

ఇవి కూడా చదవండి

లియో రికార్డు లు బ్రేక్..

కూలీ థియేటర్లలో రజనీ ఫ్యాన్స్ హంగామా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.