బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు సుమ కనకాల.. ఎప్పటి నుంచో ఆమె ప్రేక్షకులను తన మాటకారీ తనంతో ఆకట్టుకుంటున్నారు సుమ. తెలుగమ్మాయి కాకపోయినా అనర్గళంగా తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు సుమ. ఎన్నో ప్రోగ్రామ్స్ ను తన మాటలతో.. చమత్కారాలతో సక్సెస్ చేశారు సుమ. ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే సుమ సునాయాసంగా హ్యాండిల్ చేయగలరు. సినిమా తారల్లో కూడా సుమ యాంకరింగ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఒక సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల నుంచి ఆ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ ఇలా ఏ ఈవెంట్ జరిగిన సుమ ఉండాల్సిందే. అంతలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సుమ. ఇక సుమ పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా మందికి తెలుసు ఆమె భర్త ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల..
సినిమా ఈవెంట్ తో బిజీగా ఉండే సుమ. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫొటోలతో కట్టుకుంటూనే.. తన ఈవెంట్స్, పర్సనల్ విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు సుమ. ఈ స్టార్ యాంకర్ కు ఓ సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందులో రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు సుమ. తాజాగా ఓ వీడియోను వదిలారు ఆమె.
తన పెళ్ళై 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ నాటి విషయాలను, అప్పుడు చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది సుమ. తమ పెళ్లి రోజు సందర్భంగా సుమ, రాజీవ్ కు పిల్లలు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఓల్డేజ్ హోమ్ లో కొద్దిసేపు గడిపారు. అనంతరం తమ పర్సనల్ విషయాల గురించి మాట్లాడారు రాజీవ్ , సుమ. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పారు ఈ జంట. అందులో ఓ నెటిజన్ భాగస్వామికి తెలియకుండా వారి ఫోన్‌ను ఎప్పుడైనా చెక్ చేశారా? అని అడిగితే.. రాజీవ్ కనకాల నో అని చెప్పాడు. కానీ సుమ మాత్రం యస్ అని చెప్పింది. దాంతో రాజీవ్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత తమ గొడవలగురించి తెలిపారు. ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్తాడు కానీ ఎంత టైం అయినా వచ్చేవాడు కాదు. ఇలా చాలా సార్లు చేశాడని సుమ తెలిపింది. అప్పట్లో అలా చేసిన దానికి ఇప్పుడు సారీ చెప్పాడు రాజీవ్ కనకాల. దాంతో సుమ తెగ సంబరపడిపోయింది.
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.