
RRR Remuneration: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. జక్కన్న రూపొందిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా (Corona) కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. . తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌ల హక్కులను స్టార్ ఇండియా దక్కించుకుంది. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న స్టార్ హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఈ మూవీ కోసం దాదాపు మూడేళ్లు కేటాయించారు. ఈ సినిమాకోసం ఇద్దరు హీరోల్లో ఒక్కో హీరో అందుకున్న పారితోషికం 45 కోట్లు రెమ్యునరేషన్ అనుకుంటున్నారని టాక్. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇందుకు గానే ఆయనకు 25 కోట్లు అందజేశారట. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుంది. ఇందుకోసం ఆమెకు రెమ్యునరేషన్ కింద 9 కోట్లు ఇచ్చారట. అలాగే రాజమౌళి రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో వాటాని తీసుకుంటానని అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్.
మరిన్ని ఇక్కడ చదవండి :