
రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచం మొత్తం మారుమ్రోగుతోంది. పాన్ ఇండియా డైరెక్టర్ గా రాజమౌళి మంచి పేరు సంపాదించుకున్నారు. మొన్నటి వరకు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా రాణించిన రాజమౌళి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు జక్కన్న. భారీ విజయాన్ని అందుకోవడమే కాదు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి.
రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే రాజమోళి కమెడియన్ వేణు మాధవ్ కు అసిస్టెంట్ గా చేశారని మీకు తెలుసా..?
రాజమౌళి వేణుమాధవ్ కు అసిస్టెంట్ గా పని చేయడం ఏంటి..? అని అనుకుంటున్నారా. ఇది నిజజీవితంలో కాదు. ఒక సినిమాలో రాజమౌళి వేణుమాధవ్ కు అసిస్టెంట్ గా కనిపించారు. ఆ సినిమా ఎదో కాదు.. నితిన్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన సై సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఆ సినిమాలో వేణు మాధవ్ నల్లబాలు పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో రాజమౌళి చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో వేణుమాధవ్ దగ్గర పని చేసే వ్యక్తిగా కనిపించారు జక్కన్న. సై మూవీలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు రాజమౌళి. అంతే కాదు ఇంకా చాలా సినిమాల్లో రాజమోళి చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ మధ్య ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో కూడా కనిపించారు రాజమౌళి.
రాజమౌళి , వేణు మాధవ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.