రాజ‌మౌళి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న..త‌దుప‌రి చిత్రం మ‌హేశ్ బాబుతో..

భార‌త ద‌ర్శ‌క దిగ్గ‌జం త‌న త‌దుప‌రి చిత్రం గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో..నెక్ట్స్ సినిమా ఉంటుందని టీవీ9కి ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌హేశ్ ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న డెడ్లీ కాంబినేష‌న్ ఇది. దీంతో వారి ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా పోయాయి. ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత మ‌హేశ్ తో సినిమా ఉంటుంద‌ని..కాదు ప్ర‌భాస్ తో ఉంటుంద‌ని రూమ‌ర్స్ […]

రాజ‌మౌళి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న..త‌దుప‌రి చిత్రం మ‌హేశ్ బాబుతో..

Edited By:

Updated on: Apr 18, 2020 | 2:19 PM

భార‌త ద‌ర్శ‌క దిగ్గ‌జం త‌న త‌దుప‌రి చిత్రం గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో..నెక్ట్స్ సినిమా ఉంటుందని టీవీ9కి ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌హేశ్ ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న డెడ్లీ కాంబినేష‌న్ ఇది. దీంతో వారి ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా పోయాయి.

ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత మ‌హేశ్ తో సినిమా ఉంటుంద‌ని..కాదు ప్ర‌భాస్ తో ఉంటుంద‌ని రూమ‌ర్స్ వ‌స్తున్నాయ‌ని..వాటిపై క్లారిటీ ఇవ్వాల‌ని టీవీ9 యాంక‌ర్ దీప్తి..రాజ‌మౌళిని ప్ర‌శ్నించింది. అందులో రూమ‌ర్ ఏం లేద‌ని..ప్రొడ్యూస‌ర్ దాన‌య్య‌గారితో ఆర్.ఆర్.ఆర్ ముగిసిన త‌ర్వాత..ప్రొడ్యూస‌ర్ నారాయ‌ణ గారి నిర్మాణంలో మ‌హేశ్ బాబుతో తన కాంబినేష‌న్ లో సినిమా తీయ‌బోతున్న‌ట్లు రాజ‌మౌళి క్లారిటీ ఇచ్చారు.