RRR Movie: తారక్‌ ప్రేమను తట్టుకోవడం కష్టం, చరణ్‌లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. జక్కన్న ఆసక్తికర విషయాలు..

|

Dec 28, 2021 | 6:37 AM

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిపెరిగిపోతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా దేశంలోని...

RRR Movie: తారక్‌ ప్రేమను తట్టుకోవడం కష్టం, చరణ్‌లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. జక్కన్న ఆసక్తికర విషయాలు..
Follow us on

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిపెరిగిపోతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీల్లో భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న సినిమాను తెరకెక్కించనట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమైపోయింది. ఇక జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను జక్కన్న టీమ్‌ హోరెత్తిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు లేని విధంగా తొలిసారి ఇతర రాష్ట్రాల్లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. మొన్న ముంబయిలో ఈవెంట్‌ను నిర్వహించిన చిత్ర యూనిట్‌ తాజాగా సోమవారం చెన్నైలో ప్రీరిలిజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.

అభిమానులు భారీ ఎత్తున హాజరైన ఈ సభలో తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక తమిళంలో ఈ సినిమాను లైకా మూవీస్‌ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రిరీలరిజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న రాజమౌళి ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్‌ ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. నేను షాట్‌ పెడితే చాలు నా ఊహలోని విజువల్‌కు తగ్గట్లుగా నటిస్తాడు. ఇలాంటి యాక్టర్‌ దొరకడం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు.. భారతీయ సినిమా చేసుకున్న అదృష్టం’ అని చెప్పుకొచ్చారు.

ఇక రామ్‌ చరణ్‌ గురించి ప్రత్సావిస్తూ.. తాను పని గురించి ఎంతో ఆలోచించి సెట్స్‌కు వస్తుంటానని, కానీ చరణ్‌ క్లియర్‌ మైండ్‌తో వచ్చి ‘నా నుంచి మీకు ఏం కావాలి?’ అని అడుగుతారని అన్నారు. రామ్‌ చరణ్‌లాంటి మెంటాలిటీని నేను ఎక్కడా చూడలేదని తెలిపిన రాజమౌళి, తన గురించి తను అంత సెక్యూర్‌గా ఫీలైన యాక్టర్‌ను నేను ఇంతవరకు చూడలేదు. అంత అద్భుతంగా యాక్ట్‌ చేస్తారని చెప్పుకొచ్చారు.

Also Read: Joint Pain Relief Tips: కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా? ఈ హోమ్ రెమెడీస్ ప్రయత్నించి ఉపశమనం పొందండి..

Delhi govt: విద్యార్థులకు శీతాకాలపు సెలవుల ప్రకటన.. జనవరి 1 నుంచి 15 వరకు..

Viral Video: కళ్లను మాయ చేస్తున్న తొమ్మిదో వింత.. అచ్చం చెక్క ముక్కలా..