Mohanlal: ఇది మీ కృషికి గుర్తింపు.. మోహన్ లాల్‏కు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు..

భారతీయ సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మక అవార్డులలో దాదా సాహెబ్ ఫాల్కే ఒకటి. 2023 సంవత్సరానికి గానూ మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్‏ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. సినీరంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. దీంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Mohanlal: ఇది మీ కృషికి గుర్తింపు.. మోహన్ లాల్‏కు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు..
Ashwini Vaishnaw, Mohanlal

Updated on: Sep 20, 2025 | 9:21 PM

మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ ను భారతీయ సినిమా ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. సినీరంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ ఆయన ఈ అవార్డ్ అందుకోనున్నారు. దీంతో ఇప్పుడు ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీరంగంలో దశాబ్దాలుగా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా అద్భుతమైన సేవలు అందించారు మోహన్ లాల్. సెప్టెంబర్ 23న జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఆయన ఈ అవార్డును స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మోహన్ లాల్ కు అభినందనలు తెలిపారు.

ప్రధాని మోదీ అభినందనలు..

మోహన్ లాల్ తో కలిసి దిగిన ఫోటోను ప్రదాని మోదీ సోషల్ మీడియాలో పంచుకుంటూ మలయాళఈ సినిమకు దివిటీలా నిలిచారని ప్రశంసలు కురిపించారు. కేవలం మలయాళమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ అద్భుతమైన పాత్రలు పోషించారని.. ఆయన ఎంతో స్పూర్తి నింపారని అన్నారు.

రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ అభినందనలు..

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం మోహన్ లాల్ ను అభినందించారు. ” కేరళలోని అందమైన ఆదిపోలి భూమి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల వరకు, ఆయన చేసిన కృషి మన సంస్కృతిని జరుపుకుంది. అలాగే ఆకాంక్షలను పెంచింది. ఆయన వారసత్వం భారతదేశం సృజనాత్మక స్ఫూర్తిని ప్రేరేపిస్తూనే ఉంటుంది.” అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..