RRR: ఆస్కార్ వేదిక పై మన పాట.. లైవ్ లో పాడనున్న రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ

నాటు నాటు ప్రభంజనం ఆస్కార్‌ స్టేజ్‌పైకి ఎక్కబోతోంది. ఈ నెల 12న ది అకాడెమీ 95వ ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చేయనుంది.

RRR: ఆస్కార్ వేదిక పై మన పాట.. లైవ్ లో పాడనున్న రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ
Rrr

Updated on: Mar 01, 2023 | 7:38 AM

ఇది మామూలు విషయం కాదు. తెలుగు జెండాను అమెరికాలో రెపరెపలాడించబోతన్నారు మన కుర్రాళ్లు. ట్రిపులార్‌ రికార్డులు, రివార్డులు, అవార్డులకు మించిన విషయమిది. నాటు నాటు ప్రభంజనం ఆస్కార్‌ స్టేజ్‌పైకి ఎక్కబోతోంది. ఈ నెల 12న ది అకాడెమీ 95వ ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చేయనుంది. అదే రోజు అదే స్టేజ్‌పై మన నాటు నాటు పాటని పాడబోతున్నారు సింగర్లు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ. ఆస్కార్‌ స్టేజ్‌పై అగ్గిరాజేయబోతున్నారు. హాలీవుడ్‌ని షేక్‌ చేసే పెర్ఫామెన్స్‌ ఇవ్వనున్నారు సింగర్స్‌.

ఆస్కార్స్‌ అంటే.. వరల్డ్‌ వైడ్‌గా ఎంత పాపులరో అందరికీ తెలుసు. వరల్డ్‌ వైడ్‌ సినిమా ఇండస్ట్రీలో దీన్ని మించిన అవార్డుల కార్యక్రమం మరోటి లేదు. చాలా మంది ఆస్కార్స్‌ వరకు వెళ్తేనే చాలని కలలు కంటుంటారు. ప్రతీ ఏటా మన దేశం నుంచి ఒకరికి పిలుపు వస్తుంటుంది ఆ అతిథి వెళ్లి రెడ్‌ కార్పెట్‌పై ఫొటో షూట్‌ చేసుకుని సోషల్‌ మీడియాలో పెడుతుంటారు. కాని ఇది అలాంటి సాదా సీదా విషయమే కాదు. ఆస్కార్‌ స్టేజ్‌పై పాడడం.. అది కూడా మన తెలుగు పాట అంటే ఎంతటి గర్వకారణమది.

కేవలం సెల్ఫీ కోసం వెళ్లే నటులున్నారు. కాని మన పాటకు పట్టం కడుతోంది ఆస్కార్‌ స్టేజ్‌. మన ట్రిపులార్‌ టీమ్‌ కోసం రెడ్‌ కార్పెట్‌ పరుస్తోంది అమెరికన్‌ అకాడమీ. ట్రిపులార్‌లో ఏంటి గొప్ప అంటున్న ప్రతీ ఒక్కరికీ.. ఇది కేవలం ఆన్సర్‌ మాత్రమే కాదు. చెంపపెట్టే అని చెప్పాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..