The Girlfriend Movie: ఆ అమ్మాయికి డబ్బులిచ్చి అలా చేయించారా? చున్నీ కాంట్రవర్సీపై రాహుల్ రవీంద్రన్ ఏమన్నారంటే?

రష్మిక మందన్నా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన తర్వాత ఒక అమ్మాయి స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సినిమాలో రష్మిక లాగే చున్నీ తీసేసిన ఆమె తాను కూడా లైఫ్ ను ఇలాగే ఫేస్ చేస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

The Girlfriend Movie: ఆ అమ్మాయికి డబ్బులిచ్చి అలా చేయించారా? చున్నీ కాంట్రవర్సీపై రాహుల్ రవీంద్రన్ ఏమన్నారంటే?
Rashmika Mandanna The Girlfriend Movie

Updated on: Nov 15, 2025 | 7:45 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి మరో కీలక పాత్ర పోషించాడు. నవంబర్ 07న థియేటర్లలో విడుదలైన ఈ లవ్ ఎంట్‌ర్‌టైనర్‌ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.ఇప్పటికే రష్మిక సినిమా రూ. 20 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా ఎలా ఇబ్బంది పడుతున్నారన్నది ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. దీంతో చాలా మంది అమ్మాయిలు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ఓన్ చేసుకుంటున్నారు. సినిమా చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సినిమాల్లో లాగే తాము రియల్ లైఫ్ లో ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నామంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన ఒక అమ్మాయి స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రష్మిక సినిమా చూసిన ఓ అమ్మాయి డైరెక్టర్ రాహుల్‌ను చూసి అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా తన చున్నీ తీసి గర్వంగా తిరుగుతానంటూ చేసి చూపించింది. ఈ వీడియో కాస్తా నెట్టింట బాగా వైరలైంది. దీంతో అమ్మాయిని మెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్‌ ఒక హగ్ ఇచ్చాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అ యితే సినిమా ప్రమోషన్ కోసమే ఇదంతా చేశారని ఒక నెటిజన్ ట్రోల్ చేశాడు. కేవలం దుపట్టా, హగ్‌ కోసమే ఆ ‍అమ్మాయికి డబ్బులిచ్చి పీఆర్ స్టంట్స్ చేయించారంటూ విమర్శించాడు. ఇది చూసిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌ స్పందించాడు. ట్విటర్ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.

ఇవి కూడా చదవండి

‘ఆ అమ్మాయిపై నెగెటివిటీ రాకూడదనే ఇప్పటివరకు దీనిపై స్పందించకుండా ఉన్నాను. కానీ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలను ఖండించాల్సి అవసరముంది. ఈ థియేటర్‌కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు ఎక్కడికి వెళ్లాలో మేము కచ్చితంగా డిసైడ్‌ అవ్వలేదు. ఆ థియేటర్‌కు మేము వెళ్తామో కూడా చివరికి వరకు మాకే తెలియదు. ఆ వీడియోను బయట పెట్టడం గురించి నేను కొంచెం ఆందోళన చెందా. కొందరు ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తారని భయపడ్డా. ఇప్పుడు ఆ అమ్మాయి పట్ల నాకు భయంగా ఉంది. ఆమెకు చాలా బలంగా, ధైర్యంగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం ద్వారా వారి చున్నీలను తీయమని నేను చెప్పడం లేదు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగతం. ఒక అమ్మాయి తన చున్నీని యాదృచ్ఛికంగా తీయడం వల్ల ఓ వర్గం ప్రజలు బాధపడుతున్నారు. ఇది మన సంస్కృతిని కాపాడుకోవడం అనే చాలా పెద్ద ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.

‘ఎవరైనా పురుషులు ఓ యాక్షన్ సన్నివేశానికి ముందు తమ చొక్కాలు చింపివేసినప్పుడు ఎవరూ ప్రశ్నించడం లేదు. నేను ఒకరిని ప్రేరేపించాలని ఎక్కడా చెప్పడం లేదు. కేవలం పక్షపాత ధోరణిని మాత్రమే ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ మన సంస్కృతిని కాపాడుకునే భారాన్ని ఓ వర్గం మన మహిళల భుజాలపై మాత్రమే ఎందుకు మోపింది? ది గర్ల్‌ఫ్రెండ్‌ లాంటి సినిమా ఈ రోజు సందర్భోచితంగా ఉందా? అవసరమా? అని నన్ను అడిగే కొద్ది మంది మాత్రమే ఈ చిత్రానికి వస్తున్న ప్రతిస్పందనలను గమనిస్తున్నారని ఆశిస్తున్నా. ఇక్కడే వారికి సమాధానం దొరుకుతుంది’ అని నెటిజన్‌కు గట్టిగానే రిప్లై ఇచ్చేశాడు.

రాహుల్ రవీంద్రన్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి