
ఎన్నో సినిమాల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన నటుడు రాహుల్ రామకృష్ణ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని సోదరుడు కన్నుమూయడంతో రాముల్ కృష్ణతో సహా అతని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. పారాక్వాట్ అనే రసాయన గడ్డి మందు కారణంగా తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని రాహుల్ రామకృష్ణ ఎమోషనల్ అయ్యాడు. అత్యంత విషపూరితమైన ఈ రసాయనాన్ని వెంటనే నిషేధించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీఎం నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు రాహుల్ రామకృష్ణ. ‘పారాక్వాట్ అనే రసాయన గడ్డిమందు కారణంగా నా సోదరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇది అత్యంత విషపూరితమైన రసాయనం. కానీ ఇది మన తెలంగాణ రాష్ట్రంలో చాలా సులభంగా అందుబాటులో ఉండటం తెలిసి నేను షాక్ కు గురయ్యాను. ఈ రసాయనం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్యను చూసి డాక్టర్లు కూడా షాకవుతున్నారు. చాలా మంది ఆత్మహత్యల కోసం ఈ మందును విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి వీలైనంత త్వరగా దీనిని నిషేధించండి . ప్రాణాలను కాపాడండి’ అని కోరాడు రాహుల్ రామకృష్ణ.
తన ట్వీట్ కు పీఎం నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయాలను ట్వీట్ చేశాడు రాహుల్ రామకృష్ణ.ప్రస్తుతం ఈ టాలీవుడ్ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాహుల్ రామకృష్ణ సోదరుడి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.
Honourable Sirs @TelanganaCMO @PMOIndia,
Lost my brother today to Paraquat poisoning. It’s terrifyingly lethal and widely misused for self-destruction. Shocked by how easily it is available everywhere. Doctors are overwhelmed by the amount of cases.Please ban it ASAP-save lives🙏🏽— Rahul Ramakrishna (@eyrahul) March 26, 2026
కాగా పారాక్వాట్ అనేది అత్యంత విషపూరితమైన కలుపు మందు. పొలాల్లో కలుపు మొక్కలను సులభంగా నాశనం చేయవచ్చన్న ఉద్దేశంతో రైతులు దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పత్తి లాంటి పంటల్లో పెరిగే కలుపు, పొలాల గట్ల మీదున్న గడ్డిని నాశనం చేయడానికి ఈ మందును ఉపయోగిస్తున్నారు. అయితే పారాక్వాట్ అత్యంత విషపూరితమని వైద్యులు చెబుతున్నారు. కొద్ది మోతాదులో తీసుకున్నప్పటికీ ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఆత్మహత్యల కోసం ఈ మందును తాగి ప్రాణాలు కోల్పోతున్నారు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.