Pooja Hegde: ఓ ఇంటిదైన చిన్నది.. ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన ‘బుట్టబొమ్మ’..

|

Feb 19, 2021 | 8:51 AM

Pooja Hegde Buy Home In Mumbai: సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ఎవరికైనా ఉండే కామన్‌ కోరిక ఇంటిని కట్టుకోవాలి. వారి వారి స్థోమత, స్థాయికి తగ్గట్లు సొంతింటిని నిర్మించుకోవాలని లేదా కొనుగోలు చేయాలని చూస్తుంటారు. తమకంటూ..

Pooja Hegde: ఓ ఇంటిదైన చిన్నది.. ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన బుట్టబొమ్మ..
Follow us on

Pooja Hegde Buy Home In Mumbai: సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ఎవరికైనా ఉండే కామన్‌ కోరిక ఇంటిని కట్టుకోవాలి. వారి వారి స్థోమత, స్థాయికి తగ్గట్లు సొంతింటిని నిర్మించుకోవాలని లేదా కొనుగోలు చేయాలని చూస్తుంటారు. తమకంటూ ఓ ఇంటిని నిర్మించుకుంటేనే లైఫ్‌లో సెటిల్‌ అయ్యామని భావిస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా అందాల భామ పూజాహెగ్డే కూడా తన సొంతింటి కలను నెరవేర్చుకుంది. ‘ఒక లైలా కోసం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అందాల తార అనతి కాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకుంది. వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ బడా స్టార్‌ల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది. ఇక రెమ్యునరేషన్‌ను కూడా పెంచేసిన ఈ ‘బుట్టబొమ్మ’ తాజాగా ఓ ఇంటిది అయ్యింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని స్కైలైన్‌ వ్యూలో ఉన్న 3బీహెచ్‌కే అపార్టమెంట్‌ను కొనుగోలు చేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటీరియర్‌ పనులు జరుగుతున్నాయని, ఈ పనులను పూజా దగ్గరుండి మరీ చూసుకుంటోందని సమాచారం. అత్యంత ఖరీదైన ఏరియాలో పూజా కొనుగోలు చేసిన ఈ అపార్డ్‌మెంట్‌ విలువ రూ.కోట్లతో ఉంటుందని టాక్‌. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం ‘రాధే శ్యామ్‌’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, సల్మాన్‌ ఖాన్‌తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక వీటితో పాటు మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన ప్రత్యేక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: Vishal Chakra Movie : విశాల్ చక్ర సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన మద్రాస్ హైకోర్టు.. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందన్న హీరో..