యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యే దేవ్(Satyadev) హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే మరో వైపు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు సత్య దేవ్. అలాగే గాడ్ ఫాదర్ సినిమాలోనూ ఓ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమా చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాలో నటించనున్నాడు. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో సత్య దేవ్ నటిస్తున్న సినిమా గాడ్సే.. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్లఫ్ మాస్టర్’ వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి.
తాజాగా ఈ సినిమానుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. `రా రమ్మంది ఊరు రయ్యిందీ హుషారు` అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేశారు చిత్రయూనిట్. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటని పాపులర్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల ఆలపించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. అవినీతిమయమైన రాజకీయ నాయకులను, వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. ఐశ్వర్య లక్ష్మి ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది. బ్రహ్మాజీ ,సిజ్జూ మీనన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 17న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.