R Narayana Murthy: ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నానంటా.. ఆ వార్తలు బాధ కలిగించాయి.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్..

సమాజం కోసమే సినిమాలు చేస్తూ.. కుల వ్యవస్థ.. దొరల పాలన వంటి నేపథ్యాలతో చిత్రాలను తెరకెక్కిస్తూ.. పీపూల్ స్టార్‏గా పేరుగాంచారు సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి.

R Narayana Murthy: ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నానంటా.. ఆ వార్తలు బాధ కలిగించాయి.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్..
R Narayana Murthy

Edited By: Rajitha Chanti

Updated on: Jul 15, 2021 | 4:04 PM

సమాజం కోసమే సినిమాలు చేస్తూ.. కుల వ్యవస్థ.. దొరల పాలన వంటి నేపథ్యాలతో చిత్రాలను తెరకెక్కిస్తూ.. పీపూల్ స్టార్‏గా పేరుగాంచారు సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి. కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాతగా.. దర్శకుడిగా నారాయణ మూర్తి గుర్తింపు పొందారు. అయితే ఇటీవల గత కొంత కాలంగా ఆయన ఆర్థికంగా చితికిపోయారని.. డబ్బులు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారని.. కనీసం హైదరాబాద్‏లో సొంత ఇల్లు కూడా లేకుండా.. నగర శివార్లలో ఉంటున్నారని సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇటీవల రైతన్న సినిమా ప్రివ్యూ సందర్భంగా.. గాయకుడు గద్దర్ చేసిన వ్యా్ఖ్యలతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆర్.నారాయణ మూర్తి సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని.. తాను ఉంటున్న ఇంటికి అద్దె కూడా కట్టలేని పరిస్థితులలో ఉన్నాడని.. సాయం చేస్తానని చెప్పిన ఒప్పుకోని మనస్తత్వం నారాయణమూర్తి సొంతం అంటున్న చెప్పుకొచ్చారు. దీంతో నెట్టింట్లో నారాయణమూర్తి అభిమానులు ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

అయితే తనపై వస్తున్న వార్తలపై ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని.. అద్దె కట్టలేని పరిస్థితులల్లో తాను ఉన్నానంటూ వచ్చే వార్తలు అవాస్తవమని నారాయణమూర్తి చెప్పారు. తనకు నగర శివార్లలో స్వేచ్చగా ఉంటుందని.. అందుకే అక్కడే ఉంటున్నానని చెప్పుకొచ్చారు. తనపై ప్రేమతో, అభిమానంతోనే గద్దర్ అలా చెప్పారని.. నారాయణ మూర్తి అన్నారు. సిటీలో ప్రయాణించడానికి తనకు ప్రతి రోజు వెయ్యి రూపాయాలు ఖర్చు అవుతుందని.. అంటే నెలకు రూ.30 వేలు కేవలం ఆటోలకే ఖర్చు చేస్తున్నానని చెప్పారు. తనకు ఇల్లు ఇస్తానని గతంలో కొందరు అధికారులు చెప్పినా తాను తీసుకోలేదని అన్నారు. తనకు ఆర్థికంగా సాయం చేయగలిగే స్నేహితులు ఉన్నప్పటికీ వీరిని ఇపయోగించుకోవడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. ఇలాంటి అసత్య వార్తలు తన మనసుకు తీవ్ర బాధను కలిగిస్తున్నాయని చెప్పారు.

Also Read: Kim Sharma: టెన్నిస్ ఆటగాడు లియాండర్ ఫేస్‏తో “ఖడ్గం” హీరోయిన్ ప్రేమాయణం.. స్పందించిన మాజీ ప్రియుడు..

Kiran Abbavaram: బ్యాక్‌గ్రౌండ్‌ లేదనే ఫీలింగ్‌ లేదు.. కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను.. హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..