పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీని వదలడం లేదు. సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికే సినిమా పైరసీ అవుతుంది. దాంతో వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలను ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి చూడకుండా అవుతోంది. తాజాగా ఓ వ్యక్తి పైరసీలో సినిమాను చూసి సినిమాబాగుందని , క్లామాక్స్ మళ్లీ మళ్లీ చూశానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా సదురు హీరోను కూడా ట్యాగ్ చేశాడు. దాంతో అతడు అడ్డంగా బుక్కయ్యాడు. విషయం ఏంటంటే హీరో మాధవన్(R Madhavan) నటించిన లేటెస్ట్ మూవీ ‘రాకెట్రీ’ (Rocketry)ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది కూడా.. అయితే ఈ సినిమాను కొందరు పైరసీ చేసి పలు వెబ్ సైట్స్ లో ఉంచారు. పైరసీలో సినిమా చూసిన ఓ వ్యక్తి..
మాధవన్ నటన పై ప్రశంసలు కురిపించాడు. అలాగే దర్శకుడిగా మొదటి సినిమా అయినా కూడా అదరగొట్టేశారు అన్నాడు. సినిమా లో క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ సీన్స్ ను మళ్లీ మళ్లీ చూశాను.. అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దీనిపై హీరో మాధవన్ స్పందించాడు. క్లైమాక్స్ సన్నివేశాలను మీరు మళ్లీ మళ్లీ ఎలా చూడగలిగారు.? అని ప్రశ్నించాడు. దానికి చాలా మంది పైరసీలో చూసి ఉంటాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ’ . ఆర్. మాధవన్ తొలిసారిగా దర్శకుడిగా మారి ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. సీనియర్ నటీమణి సిమ్రన్ కీలక పాత్రలో నటించింది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో షారుఖ్, సూర్య కీలకపాత్రల్లో కనిపించారు.