
సంచలనం అనే పదానికి సాలిడ్ ఉదాహరణ ఏదైనా ఉంది అంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కాంతార చెప్పాలి. కన్నడ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఇప్పుడు పాన్ ఇండియా హిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400కోట్లకు పైగా వసూల్ చేసింది. తెలుగులోనూ ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దక్షిణ కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాల్లో భూత్‌కోలా వేడుకలు చాలా ఫేమస్. ఈ నేపథ్యంలోనే సినిమాను తెరకెక్కించారు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి. కాంతారా చిత్రంలో ఈ వేడుకల్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు రిషబ్‌శెట్టి. విడుదలైన అన్ని భాషల్లో కాంతార బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో 20 నిముషాలు ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోపెడుతుంది.
ప్రస్తుతం ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమా పై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. తాజాగా కాంతారా సినిమా గురించి ఏకంగా పరీక్షల్లో కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. కర్ణాటక ప్రభుత్వంలో జరిగిన మిల్క్ ఫెడరేషన్ పరీక్షలలో కాంతార సినిమా గురించి ప్రశ్నలు వేశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను కాంతార హీరోయిన్ సప్తమి గౌడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా విడుదలైన కాంతార సినిమా దేని ఆధారంగా తెరకెక్కినది అంటూ నాలుగు ఆప్షన్లను ఇచ్చారు. జల్లికట్టు, భూత కోల, యక్షగాన, దమ్మామి అంటూ అప్షన్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Kantara