Allu Arjun: హిందీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టనున్న బన్నీ!.. ఎందుకంటే..

|

Nov 28, 2021 | 9:03 PM

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..

Allu Arjun: హిందీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టనున్న బన్నీ!.. ఎందుకంటే..
Follow us on

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మంధన పుష్పరాజ్‌ ప్రేయసిగా నటిస్తోంది. ఫాహిద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అదే స్థాయిలో ప్రమోట్‌ చేయాలని భావిస్తోంది చిత్ర బృందం. కాగా హిందీలో ఈ మూవీని ప్రమోట్‌ చేసేందుకు స్వయంగా బన్నీనే రంగంలోకి దిగుతున్నాడని సమాచారం. ఇందులో భాగంగా సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో ఐకాన్‌స్టార్‌ స్పెషల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ వార్త సినిమా సర్కిళ్లలో బాగా చక్కర్లు కొడుతోంది.

కాగా బన్నీ, సల్మాన్‌లకు ఇదివరకే బాగా పరిచయం ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ నటించిన ‘దువ్వాడ జగన్నాథం(డీజే)’ లోని సీటీమార్‌ సాంగ్‌కు సల్మాన్‌ ‘రాధే’ మూవీలో స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. కాగా తన పాటను వాడుకోనిచ్చినందుకు సల్లూ భాయ్‌ బన్నీకి థ్యాంక్స్‌ చెప్పగా… ‘రాధే’ మూవీలో మీ స్టెప్పులు అదిరిపోయాయని సల్మాన్‌పై ప్రశంసలు కురిపించాడు స్టైలిష్‌ స్టార్‌. కాగా ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళి కూడా సల్లూ భాయ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. తన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కోసం ముంబయిలో వేడుకగా నిర్వహించే ఆడియో వేడుకకు సల్మాన్‌ను ఆహ్వానించేందుకు జక్కన్న వెళ్లారని తెలిసింది.

Also Read:

Shiva Shankar Master : సినీ పరిశ్రమలో విషాదం.. శివశంకర్ మాస్టర్ కన్నుమూత..

K.G.F: Chapter 2: ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న “కేజీఎఫ్” టీమ్.. మరోసారి సినిమా వాయిదా తప్పదా..?

Shahid Kapoor: బంతి తగలడంతో పెదవికి 25 కుట్లు పడ్డాయి.. ఇప్పటికీ ఆ గాయం మానలేదు: జెర్సీ హీరో షాహిద్‌