Sukumar-Ram Charan: మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా వెండి తెరపై చిరుతతో అడుగు పెట్టిన రామ్ చరణ్.. కెరీర్ లో మైల్డ్ స్టోన్ లాంటి మూవీ రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో 1985 విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. చెవిటి యువకుడిగా రామ్ చరణ్ నటన విమర్శకుల ప్రసంశలను కూడా అందుకుంది.
తాజాగా పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ లెక్కల మాస్టర్ సుకుమార్ మళ్ళీ రామ్ చరణ్ తో జతకట్టనున్నారు. ఈ విషయాన్నీ సుక్కునే స్వయంగా ప్రకటించాడు. పుష్ప మూవీ ప్రమోషన్ లో సమయంలో సుకుమార్ తన నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడుతూ.. బన్నీతో పుష్ప మూవీ సీక్వెల్ పుష్ప 2 ఉండనున్నదని తెలిపాడు. అనంతరం విజయ్ దేవరకొండతో ఓ సినిమా ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కించనున్నానని చెప్పాడు. సుక్కు తాను లైన్ లో పెట్టిన సినిమాల గురించి వివరించాడు. అయితే రామ్ చరణ్ తో సినిమా ఇంకా చర్చల దశలో ఉందని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం బన్నీ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ధియేటర్లో సందడి చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రష్మిక మందన్నా తొలిసారిగా బన్నీతో జతకట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
Also Read: పితృ దోషం, కాల సర్పదోషం నుంచి బయటపడేందుకు పుష్య అమావస్య శుభప్రదం.. ఈసారి ఏడాది వచ్చిందంటే..
వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి రైతుకి సెల్యూట్ చెప్పిన చిరు..