AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akash Jagannadh: రెండేళ్లు నేను ఏమీ ఖాళీగా లేను.. కన్‌ఫ్యూజ్‌ అయ్యాను.. ఆకాష్ జగన్నాథ్ కామెంట్స్

పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి.. ఇటీవలే పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఆకాష్ జగన్నాథ్ గా పేరు మార్చుకున్నాడు ఈ యంగ్ హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆకాష్.. ఇప్పుడు హీరోగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. మెహబూబా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఆకాష్.

Akash Jagannadh: రెండేళ్లు నేను ఏమీ ఖాళీగా లేను.. కన్‌ఫ్యూజ్‌ అయ్యాను.. ఆకాష్ జగన్నాథ్ కామెంట్స్
Akash
Rajeev Rayala
|

Updated on: Aug 19, 2024 | 3:27 PM

Share

టాలీవుడ్‌లో డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ వరుసగా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్‌ను తెరకెక్కించారు పూరి. ఆగస్టు 15న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ మూవీ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పూరిజగన్నాథ్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి.. ఇటీవలే పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఆకాష్ జగన్నాథ్ గా పేరు మార్చుకున్నాడు ఈ యంగ్ హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆకాష్.. ఇప్పుడు హీరోగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. మెహబూబా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఆకాష్.

ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు. ఆకాష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఆకాష్ చివరిగా రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. రొమాంటిక్ సినిమా వచ్చి ఏళ్లు గడుతున్నా.. ఆకాష్ కొత్త సినిమా మాత్రం అనౌన్స్ చేయలేదు. దాంతో ఆకాష్ ఎప్పుడు సినిమా చేస్తాడా.? అని పూరి ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఆకాష్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. నేను ఈ వీడియో షేర్ చేయడానికి ఓ కారణం ఉంది. చాలా మంది.. చాలా రోజులుగా అడుగుతున్నారు. ఆకాష్ అసలు నువ్వు ఏం సినిమా చేస్తున్నావ్‌.? ఎందుకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు అని.. సినిమా చేసి రెండేళ్లయిపోయింది.. ఎందుకు చాలాకాలంగా ఖాళీగా ఎందుకుంటున్నావ్‌? అని అడుగుతున్నారు. చాలా ఖాళీగా ఏం లేను.. చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. చాలా కథలు విన్నాను. నాకు ఓ మంచి నిర్మాత, ప్రొడక్షన్‌ హౌస్‌ దొరికింది. మంచి దర్శకుడు. కథలు వింటూ ఉన్నప్పుడు కన్‌ఫ్యూజ్‌ అయిపోతూ ఉండేవాడిని. దేవుడి దయ వల్ల, నేను నమ్మిన అమ్మవారి దయ వల్ల నాకంటూ మంచి టీమ్‌ దొరికింది. ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్సయి ఓ సినిమా ఫైనల్‌ చేశాను. అని చెప్పుకొచ్చాడు. చెప్పినట్టే తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు ఆకాష్. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. తల్వార్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ పోస్టర్ లో ఆకాష్ అదరగొట్టేశాడు. చూస్తుంటే ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అర్ధమవుతోంది.

ఆకాష్ జగన్నాథ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us