పూరీ జగన్నాథ్ దమ్మున్నోడే కాదు..మనసున్నోడు కూడా!

| Edited By: Pardhasaradhi Peri

Sep 27, 2019 | 5:32 PM

పూరి జగన్నాథ్..ఈ పేరుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సపరేట్ బ్రాండ్ ఉంది. 30 రోెజుల్లో సినిమా తీసి కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఆయనకే చెల్లతుంది. ఆయన సినిమాలో మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు..సోషల్ కాన్షియస్ కూడా ఉంటుంది. ఒక డైలాగ్‌తో సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్యను సింపుల్‌గా మనముందుచుతాడు. పూరి అంటే ఒక మేనియా, పూరీ అంటే ఒక ఇజం, పూరీ అంటే సెన్సేషన్. తాను చేస్తుంది పెద్ద హీరో అయినా, చిన్న హీరో […]

పూరీ జగన్నాథ్ దమ్మున్నోడే కాదు..మనసున్నోడు కూడా!
Follow us on

పూరి జగన్నాథ్..ఈ పేరుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సపరేట్ బ్రాండ్ ఉంది. 30 రోెజుల్లో సినిమా తీసి కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఆయనకే చెల్లతుంది. ఆయన సినిమాలో మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు..సోషల్ కాన్షియస్ కూడా ఉంటుంది. ఒక డైలాగ్‌తో సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్యను సింపుల్‌గా మనముందుచుతాడు. పూరి అంటే ఒక మేనియా, పూరీ అంటే ఒక ఇజం, పూరీ అంటే సెన్సేషన్.

తాను చేస్తుంది పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా సరే… పూర్తిగా తన అండర్ కంట్రోల్‌‌లోకి తెచ్చుకుంటాడు. ఆ హీరోకి టిపికల్ బాడీ లాంగ్వేజ్‌‌ని ఇచ్చి..డైలాగ్ డిక్షన్ మార్చేసి..కొత్తగా మనముందుకు తీసుకువస్తాడు. పూరి తీసే సినిమాలకు బ్యాడ్ టైటిల్స్ ఉంటాయి కానీ అతడు మనసు బ్యాడ్ కాదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. అందుకు తాజా సంఘటన మరోసారి ఉదాహారణగా నిలిచింది.

రీసెంట్‌గా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా చాలాకాలం తర్వాత సక్సెస్ అందుకున్నాడు పూరీ జగన్నాథ్. ఈ చిత్రంతో దాదాపు 30 కోట్లకు పైగానే లాభాలు అందుకున్నారు ఛార్మీ, పూరీలు. అందుకే తమకు ఇంత పేరు, డబ్బు ఇచ్చిన ఇండస్ట్రీకే ఎంతోకొంత తిరిగి ఇచ్చేయ్యాలని డిసైడ్ అయ్యాడు. సెప్టెంబర్ 28న పూరీ  బర్త్ డే. ఈ సందర్భంగా.. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు దర్శకులుగా ఉండి.. సినిమాలు చేసి.. ఇప్పుడు పూర్తిగా ఫేడవుట్ అయిపోయి కష్టాల్లో ఉన్న వాళ్లకు ఎంతోకొంత ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు పూరి. అందుకు తన నిర్మాణసంస్థ భాగస్వామి అయిన ఛార్మీ కూడా అంగీకరించింది.

ఇందుకోసం  ఓ 20 మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లకు ఎంచుకున్నాడు పూరీ జగన్నాథ్. సెప్టెంబర్ 28న ఒక్కొక్కరికి 50 వేల చొప్పున సాయం చేయబోతున్నాడని సమాచారం. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని..కిందనుంచి ఎదిగినవాడిగా తనకు కష్టాలన్నీ తెలుసని చెప్తున్నాడు ఈ ఏస్ డైరెక్టర్. ఇది పెద్ద సహాయం కాకపోయినా..వారికి ఎంతోకొంత ఉపయోగపడితే చాలని పేర్కొన్నాడు. అంతేకాదు టైం బాగుంటే ప్రతి సంవత్సరం ఇలాగే హెల్ప్ చేస్తానని చెప్తున్నాడు. ఇవన్నీ వింటుంటే ఆయన డైలాగ్‌ ఒకటి పూరి గురించి చెప్పాలనిపిస్తోంది. ‘నీ కంటే తోపు ఎవడు లేడిక్కడ’. ఆడ్వాన్స్ హ్యపీ బర్త్ డే…పూరీ జగన్నాథ్.