Puneeth: ఛాతిపై పునీత్‌ రాజ్ కుమార్ పేరు.. తమ్ముడిపై ప్రేమకు గుర్తుగా పచ్చబొట్టు వేయించుకున్న రాఘవేంద్ర

తాజాగా పునీత్‌ పేరును ఛాతిపై టాటూగా వేయించుకున్నాడు సోదరుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌. ఆయనకు అప్పూ అంటే చాలా ఇష్టం. వయసులో చాలా చిన్నవాడు కావడంతో సొంత కొడుకులా చూసుకున్నాడు. అయితే చిన్న వయసులోనే పునీత్‌ కన్నుమూయడాన్ని రాఘవేంద్ర తట్టుకోలేకపోయాడు. అందుకే తన తమ్ముడిపై తనకున్న ప్రేమకు గుర్తుగా తన చాతిపై అప్పూ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు.

Puneeth: ఛాతిపై పునీత్‌ రాజ్ కుమార్ పేరు.. తమ్ముడిపై ప్రేమకు గుర్తుగా పచ్చబొట్టు వేయించుకున్న రాఘవేంద్ర
Puneeth Rajkumar

Updated on: May 31, 2023 | 3:01 PM

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ కన్నుమూసి సుమారు రెండేళ్లు కావొస్తుంది. జిమ్‌ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారు. సినీ రంగంలో ఉజ్వల భవిష్యత్‌ ఉన్న పునీత్‌ కేవలం 46 ఏళ్ల వయసులోనే కన్నుమూయడం అందరినీ కలిచివేసింది. ఇప్పటికీ అప్పు అభిమానులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నడలో ఏ మూవీ ఈవెంట్‌ జరిగినా పునీత్ పేరు తప్పకుండా స్మరించుకోవాల్సిందే. ఇక పునీత్‌ కుటుంబ సభ్యులైతే ఎక్కడైనా అప్పు ఫొటో కనిపిస్తే చాలు ఎమోషనలవుతున్నారు. ముఖ్యంగా పునీత్ సోదరులు శివరాజ్‌ కుమార్, రాఘవేంద్ర ఏ సినిమా ఈవెంట్ కెళ్లినా సోదరుడిని తల్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా పునీత్‌ పేరును ఛాతిపై టాటూగా వేయించుకున్నాడు సోదరుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌. ఆయనకు అప్పూ అంటే చాలా ఇష్టం. వయసులో చాలా చిన్నవాడు కావడంతో సొంత కొడుకులా చూసుకున్నాడు. అయితే చిన్న వయసులోనే పునీత్‌ కన్నుమూయడాన్ని రాఘవేంద్ర తట్టుకోలేకపోయాడు. అందుకే తన తమ్ముడిపై తనకున్న ప్రేమకు గుర్తుగా తన చాతిపై అప్పూ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు.

 

ఇవి కూడా చదవండి

అప్పుతో పాటు టోటో, నుక్కీ పేర్లను కూడా ట్యాటుగా వేయించుకున్నాడు రాఘవేంద్ర. ఇవి పునీత్ ఇద్దరి కుమార్తెల ముద్దు పేర్లు. వారి అసలు పేర్లు వందిత, ధ్రుతి. ప్రస్తుతం రాఘవేంద్ర పచ్చబొట్టుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. అన్నదమ్ముల అనుబంధానికి ఇది నిదర్శనమంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాఘవేంద్ర విషయానికొస్తే.. నటుడిగానే కాకుండా నిర్మాత కూడా సత్తాచాటారు. సమారు ఐదారు చిత్రాల్లో నటించిన ఆయన.. పునీత్ చివరగా పునీత్ నటించిన ‘జేమ్స్‌’ చిత్రంలో ఓ స్పెషల్‌ రోల్‌లో కనిపించాడు .

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..