Puneeth Rajkumar Death: పునీత్ మరణ వార్త చదువుతూ లైవ్‌లో గుండెలవిసేలా రోదించిన యాంకర్… Watch Video

హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్ పార్ధీవదేహానికి దక్షిణాది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు.

Puneeth Rajkumar Death: పునీత్ మరణ వార్త చదువుతూ లైవ్‌లో గుండెలవిసేలా రోదించిన యాంకర్... Watch Video
Anchor Cries

Updated on: Oct 30, 2021 | 5:42 PM

హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్ పార్ధీవదేహానికి దక్షిణాది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు, స్నేహశీలి ఒక్కసారిగా కుప్పకూలడంతో బరువెక్కిన గుండెతో పుష్పాంజలి ఘటించారు. కంఠీరవ కన్నీరు పెడుతోంది. మౌన రోదనతో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. బరువెక్కిన హృదయాలు.. చెమర్చే కళ్లు రియల్ హీరోకు అశ్రునివాళి అర్పిస్తున్నాయి. జన సంద్రమైన స్టేడియం అభిమానుల క్యూ లైన్లతో కిక్కిరిసిపోయింది. ప్రతి ఒక్కరి హృదయం అప్పూ అప్పూ అంటూ కన్నీటి పర్యంతం అవుతూనే ఉంది. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం కన్నడ ప్రేక్షక వర్గం అస్సలు జీర్ణించుకోలేక పోతోంది. ముఖంపై ఎప్పుడూ అందమైన చిరునవ్వు, వ్యక్తిత్వం, సేవా గుణం పునీత్‌ను నిజ జీవితంలోనూ హీరోగా మార్చాయి. అతడిని ఆఖరి చూపు చూడ్డానికి వస్తోన్న జనాన్ని చూస్తుంటేనే అర్థమవుతోంది పునీత్ ఎంత మంది అభిమానాన్ని చూరగొన్నాడో.

కాగా పునీత్ మరణ వార్త చదువుతూ లైవ్‌లో ఓ టీవీ యాంకర్ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కన్నడ వార్తా ఛానల్ BTV యాంకర్ పునీత్ మరణం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది. సహోద్యోగులు కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయింది. అలాగే కాసేపు గుక్కపెట్టి ఏడ్చింది. అనంతరం మాట్లాడిన యాంకర్.. పునీత్ కల్మషం లేని వ్యక్తని.. పెద్దవారిని, చిన్నవారిని అందర్నీ నవ్వుతూ పలుకరిస్తాడని.. అతని మరణం తనతో పాటు కోట్లాది మందిని షాక్‌లోకి నెట్టిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సర్కులేట్ అవుతోంది.

పునీత్ రాజ్‌కుమార్ బాలనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. బెట్టాడ హూవు చిత్రంలో అతడి అద్భుతమైన నటనగానూ చిన్నతనంలోనే జాతీయ అవార్డు అందుకున్నాడు. 2002లో వచ్చిన అప్పు సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి.. ఇప్పటివరకు 29 సినిమాల్లో నటించాడు. అతని చివరిసారిగా అతను యువరత్న సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

Also Read: పెళ్లి రోజున భర్తతో ఉన్న అందమైన ఫోటో షేర్ చేసిన చందమామ కాజల్