Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం జేమ్స్ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) అకాల మరణాన్ని ఇంకా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఫిట్నెస్గా.. ఆరోగ్యంగా ఉండే పునీత్ గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని అటు కుటుంబసభ్యులు.. ఇటు కన్నడ ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఇప్పటికీ పునీత్ జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికంగా షేర్ చేసుకుంటూ తమ అభిమానాన్ని తెలియజేస్తారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు పునీత్. ఆయన చివరి చిత్రం జేమ్స్ పునీత్ మరణించిన తర్వాత రిలీజ్ అయ్యింది. పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17న గ్రాండ్‌గా విడుదలైంది ఈ మూవీ.
పునీత్ ఆర్మీ ఆఫీసర్ గా నడిచిన ఈ మూవీ మాఫియా నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించారు. అయితే పునీత్ చనిపోయే సమయానికి సినిమా షూటింగ్ పూర్తయ్యింది కానీ డబ్బింగ్ మాత్రం జరగలేదు. పునీత్ రాజ్ కుమార్ డబ్బింగ్ పూర్తి చేయక పోవడంతో ఆ పాత్రకు ఆయన అన్న శివ రాజ్ కుమార్ తో డబ్బింగ్ చెప్పించారు. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా దాదాపుగా 27 కోట్ల రూపాయల వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కర్ణాటకలో ఒక కన్నడ సినిమా ఈ స్థాయిలో వసూలు చేయడం ఇదే మొదటి సారి అంటూ ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఇక జేమ్స్ సినిమా సందర్భంగా ఆయన అభిమానులు కర్ణాటక మొత్తం ఆయన ఫ్లక్సీ లను ర్పాటు చేశారు. థియేటర్స్ వద్ద అన్నదాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు అప్పు ఫ్యాన్స్.
మరిన్ని ఇక్కడ చదవండి :