Puneeth Raj Kumar: చిత్రపరిశ్రమలో తీరని విషాదం… సెట్స్ పైనున్న పునీత్ సినిమాలు ఇవే.

|

Oct 30, 2021 | 11:36 AM

కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో

Puneeth Raj Kumar: చిత్రపరిశ్రమలో తీరని విషాదం... సెట్స్ పైనున్న పునీత్ సినిమాలు ఇవే.
Puneeth Movies
Follow us on

కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో అభిమానులతోపాటు.. చిత్రపరిశ్రమలో ఒక్కసారిగా షాకయ్యింది. పునీత్ అకస్మిక మరణ వార్తను ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ ఇక లేడని వార్తను కర్ణాటక ప్రజానీకం ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. కేవలం సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ పునీత్ రియల్ హీరో.

నిన్న ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తూ గుండెపోటుకు గురయ్యాడు పునీత్. వెంటనే ఆయనను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పునీత్ చివరిసారిగా యువరత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంతోష్ ఆనంద్రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబలే బ్యానర్ పై నిర్మించారు. ఇటు తెలుగులోనూ ఈ మూవీ డబ్ చేశారు. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో ఏప్రిల్ 9న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ప్రస్తుతం పునీత్ జేమ్స్, ద్విత్వ చిత్రాలు చేస్తున్నాడు. వీటిని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో జేమ్స్ సినిమా తదుపరి షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇందులో హీరో శ్రీకాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే యూటర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ద్విత్వ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా టాక్. ఇక పునీత్.. పీఆర్కే ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి కవులదారి, మాయాబజార్ 2016, లా, ఫ్రెంచ్ బిరియాని వంటి చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఈ బ్యానర్ పై ఫ్యామిలీ ప్యాక్, వన్ కట్ టూ ఫ్లవర్ ఈజ్ కమ్ అనే సినిమాలు నిర్మిస్తున్నారు. రేపు కంఠీరవ స్టేడియంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

Also Read: Kajol: స్టార్ హీరోయిన్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే మీరు కూడా షాకవుతారు..

Puneeth Rajkumar: పునీత్ రాజ్‏కుమార్.. అశ్విని రేవంత్ లవ్‏స్టోరీ.. అప్పుడే పెద్ద సంచలనం..

Bigg Boss 5 Telugu: సిరి కత్తి పెట్టుకుని గేమ్ ఆడావ్.. అసలు పాయింట్ తీసిన సన్నీ.. చివరకు..