Puneeth Raj Kumar: తండ్రిని కలిసిన పునీత్.. కన్నీరు పెట్టిస్తున్న అందమైన పెయింటింగ్..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇంకా ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అక్టోబర్ 29న ఉదయం

Puneeth Raj Kumar: తండ్రిని కలిసిన పునీత్.. కన్నీరు పెట్టిస్తున్న అందమైన పెయింటింగ్..
Puneeth

Updated on: Nov 05, 2021 | 7:04 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇంకా ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అక్టోబర్ 29న ఉదయం పునీత్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కన్నడిగులు షాకయ్యారు. తమ అభిమాన హీరో అలా ఆకస్మాత్తుగా మరణించడంతో కర్ణాటక ప్రజలు.. సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. తమ హీరోను చివరిసారిగా చూసేందుకు పది లక్షలకు పైగా ప్రజలు పునీత్ అంత్యక్రియలకు హజరయ్యారు. అలాగే.. పునీత్ సమాధిని సందర్శించేందుకు ఇంకా ప్రజలు తరలివస్తున్నారు. మరోవైపు.. పునీత్ అరుదైన ఫోటోస్, వీడియోస్ నెట్టింట్లో షేర్ చేస్తూ.. జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పునీత్‏కు సంబంధించిన ఓ అందమైన పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Puneeth Raj Kumar

పునీత్ రాజ్ కుమార్.. స్వర్గంలో ఉన్న తండ్రిని కలిసి.. వెనకనుంచి కళ్లు మూసి పట్టుకున్నట్టున్న పెయింటింగ్ మనసులను హత్తుకుంటుంది. ఎవరోచ్చారో చెప్పుకోండి చూద్దాం అంటూ పునీత్ తన తండ్రిని అడుగుతున్నట్టుగా ఆ పెయింటింగ్ కనిపిస్తుంది. ప్రముఖ చిత్రకారుడు కరణ్ ఆచార్య రూపొందించిన ఈ పెయిటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పెయింటింగ్ చూస్తూ ఆయన అభిమానులు హార్ట్ టచింగ్.. వి మిస్ యూ పునీత్ సర్. మాటలు రావడం లేదు.. కన్నీళ్లు వస్తున్నాయి అంటూ ఒకరు కామెంట్ చేయగా.. వాట్ ఏ క్రియేటివిటీ.. అద్భుతం అంటూ మరోకరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు తమిళ్.. టాలీవుడ్ హీరోస్ ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, నాగార్జున, హీరో సూర్య పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించారు.

Also Read:  Agent Movie: ఏజెంట్ సినిమా నుంచి మరో అప్డేట్.. అఖిల్ సరసన మరో అందాల భామ..

Raja Vikramarka: ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజా విక్రమార్క.. రేపే అసలైన స్పెషల్… అదేంటంటే..

Puneeth RajKumar: పునీత్ రాజ్ కుమార్‏కు సూర్య నివాళి.. అప్పు సమాధిని చూసి హీరో ఎమోషనల్..