PSPK 28: ప‌వ‌ర్ స్టార్ రేంజ్ అంటే ఇది… పీఎస్‌పీకే 28 నేషనల్ లెవల్‌లో ట్రెండింగ్

|

Jun 09, 2021 | 4:49 PM

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో మరే హీరోకు సాధ్యం కానీ రేంజ్‌ మాస్‌ ఫాలోయింగ్...

PSPK 28:  ప‌వ‌ర్ స్టార్ రేంజ్ అంటే ఇది... పీఎస్‌పీకే 28 నేషనల్ లెవల్‌లో ట్రెండింగ్
Pspk 28
Follow us on

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో మరే హీరోకు సాధ్యం కానీ రేంజ్‌ మాస్‌ ఫాలోయింగ్ పవన్‌ సొంతం. అందుకే పవర్‌ స్టార్ ప్లాప్‌ సినిమాలు కూడా వసూళ్ల విషయంలో సేఫ్‌ ప్రాజెక్ట్స్ అనిపించుకుంటాయి. షార్ట్‌ గ్యాప్‌ తరువాత ఈ మధ్యే రీ ఎంట్రీ ఇచ్చిన పవన్‌కు ఫాలోయింగ్ మాత్రం అదే రేంజ్‌లో కంటిన్యూ అవుతోంది. ఇంత వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేకపోయినా.. కేవలం కాంబినేషన్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఓ సినిమా నేషనల్‌ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. అదే పీఎస్‌పీకే 28. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్‌. అయితే ఈ సినిమాకు సంబంధించి… ఎలాంటి న్యూస్ లేకపోయినా… ఫ్యాన్‌ మేడ్ పోస్టర్లతోనే పీఎస్‌పీకే 28 నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది.

వకీల్ సాబ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్… ప్రజెంట్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయ్యప్పనుమ్ కోషియుం రీమేక్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే భారీ పీరియాడిక్ డ్రామా కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత హరీష్ డైరెక్షన్‌లో 28th మూవీ ఉంటుంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకా వన్ ఇయర్ పడుతుంది. అయినా ఇప్పటి నుంచే ట్రెండ్స్‌లో కనిపిస్తోంది.. ఈ క్రేజీ మూవీ. ప‌వ‌ర్ స్టార్ అంటే ఆ మాత్రం ట్రెండ్ ఉండ‌టం పెద్ద కొత్త విషయం కాదంటున్నారు ఆయ‌న ఫ్యాన్స్ .

Also Read: లవ్ స్టోరీ మూవీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్న మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..?

అమితాబ్ తో ఆర్జీవీ సినిమా ఎలా ఉండబోతుంది..? బిగ్ బి కోసం వర్మ భారీ ప్లాన్ వేస్తున్నారా..?