Prabhas: వాళ్లిద్దరు సూపర్ జోడి.. అయినా ప్రభాస్ సినిమాలో ఆ సీన్స్ చేయనని ఏడ్చేసిన హీరోయిన్..

సాధారణంగా సినీరంగంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఈ హీరోకు వీరాభిమానులు. డార్లింగ్ సరసన ఒక్క ఛాన్స్ వచ్చినా సినిమా చేసేందుకు రెడీగా ఉంటారు హీరోయిన్స్. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వచ్చిన కొన్ని సీన్స్ చేయనని తెగ ఏడ్చేసిందట. ఇంతకీ ఆమె ఎవరంటే..

Prabhas: వాళ్లిద్దరు సూపర్ జోడి.. అయినా ప్రభాస్ సినిమాలో ఆ సీన్స్ చేయనని ఏడ్చేసిన హీరోయిన్..
Prabhas

Updated on: May 19, 2026 | 12:01 PM

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వం, అలాగే వర్షం చిత్ర నిర్మాణ అనుభవాలను వివరించారు. వర్షం సినిమాలో ప్రభాస్ సరసన త్రిష కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి జోడికి అడియన్స్ ఫిదా అయ్యారు. హీరోయిన్‌లు సాధారణంగా తమ డేట్లను స్వయంగా చెబుతారని, కానీ త్రిష మాత్రం తన డేట్ల డైరీని తనకి ఇచ్చి, ఎప్పుడు పిలిచినా తాను షూటింగ్‌కు వస్తానని చెప్పిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలాంటి నిబద్ధతను ఏ నటీనటులు ఇంతకు ముందు చూపలేదని రాజు అన్నారు. త్రిషను వర్షం కోసం ఎంపిక చేసిన విధానం ఆసక్తికరంగా ఉందని తెలిపారు. తొలుత ఆమె మరో చిత్రానికి ఎంపిక కాలేదని, కానీ మహేష్ బాబు వద్ద చూసిన తన ఫోటోలు రాజుకి నచ్చడంతో వర్షం కోసం ఆమెను పిలిచారని గుర్తు చేసుకున్నారు. అప్పటికే ఆ చిత్రంలో అవకాశం రాలేదని నిరాశలో ఉన్న త్రిషకు, వర్షం అవకాశం లభించింది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..

ఆమె తల్లి ఉమా సమక్షంలోనే తాను కథ గురించి చెప్పగా, సినిమాకు ఎంపిక చేస్తున్నారని ఆమె తల్లి అర్థం చేసుకున్నారని అన్నారు. అక్కడి నుంచి త్రిష తనపై అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నారని తెలిపారు. “ఇది ఎం.ఎస్. రాజు సినిమా. నాకు స్పాట్‌లో సీన్ చెప్పండి చాలు” అంటూ ఎటువంటి ప్రశ్నలు అడగకుండా షూటింగ్‌లో పాల్గొనేదని… వర్షం చిత్రానికి 75 రోజుల పాటు వర్షంలోనే చిత్రీకరణ జరిగిందని, కొన్ని సీక్వెన్స్‌లు చాలా కష్టంగా ఉండటంతో త్రిష కన్నీళ్లు పెట్టుకున్నా, చివరకు వాటిని పూర్తి చేసిందని రాజు వివరించారు. అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి వర్షం సన్నివేశాలకు ఇన్‌చార్జ్‌గా పనిచేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..

త్రిష తన కుటుంబ సభ్యురాలిగా మారిపోయిందని రాజు అన్నారు. ఒకసారి ఆయన ఆట సినిమాకు ఇలియానాను హీరోయిన్‌గా ఎంపిక చేయగా, త్రిష అలిగి, షూటింగ్‌కు వచ్చేస్తానని ఫోన్‌లు చేసిందని, అయితే షూటింగ్ రాజమండ్రిలో బోటు మధ్యలో ఉండటం వల్ల నిలిపివేయలేకపోయానని రాజు తెలిపారు. తర్వాత ఆమెను ఓదార్చారని చెప్పారు. “నా త్రిషలాంటి వారు దొరకరు” అని ఆమెతో అన్నానని రాజు వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

Prabhas, Trisha

ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

Follow Us