ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనమామ మురళీ రాజు (70) అనారోగ్యంతో మంగళవారం (మార్చి 7) ఉదయం హైదరాబాద్‌లో మరణించారు. కొద్దిరోజుల క్రితం పక్షవాతం రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. కాగా ప్రముఖ నిర్మాత మధు మంతెన తండ్రి అయిన మురళీ రాజు. మధు మంతెన హిందీ, తెలుగు, బెంగాళీలో దాదాపు 34 సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. బాలీవుడ్‌లో అమిరఖాన్ హీరోగా ‘ గజిని’ మువీని తెరకెక్కించారు. అలాగే అగ్రసినీ హీరోలతో ఉడ్తా పంజాబ్, సూపర్ 30, 83, రమన్ రాఘవ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు.
మురళి రాజు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు స్వయానా మేనమామ. మురళి రాజు కూడా గతంలో సినీ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఆయన మృతిపట్ల మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, నిర్మాత బన్నీవాసు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్.. తదితరులు మురళి రాజు పార్థివదేహానికి నివాళులర్పించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.