KS Ramarao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Tollywood)కు కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ (Hyderabad) నిలిచింది. దీంతో ఆంధ్రపదేశ్ లో కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలు జరపాలని.. గత కొంత కాలంగా అనేకమంది సినీ పెద్దలు కోరుతున్నారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ సినీ నిర్మాత కెఎస్ రామారావు స్పందించారు. ఇటీవల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో సహకారం అందించారని చెప్పారు. అంతేకాదు పెద్ద, చిన్న సినిమాలకు ఏపీ ప్రభుత్వము అండగా నిలిచిందన్నారు.
సినీ పెద్దలు ఆలోచించాలి: ఏపీలో కర్నూలులో సినిమా చిత్రీకరణకు సంబందించిన అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయని కనుక కర్నూలులో సినిమా షూటింగ్, ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు దిశగా సినీ పెద్దలు ఆలోచించాలని సూచించారు కేఎస్ రామారావు. అంతేకాదు ఇదే విషయంపై ఉగాది పండుగ తరువాత ఏపీ లోని ప్రభుత్వ పెద్దలను, సినీ పెద్దలను సంప్రదిస్తానని చెప్పారు.
ఫిల్మ్ సిటీ నిర్మాణం దిశగా: కర్నూలును సినిమా ఇండస్ట్రీ హబ్ గా చేసేందుకు ముందుకు వెళ్తామని.. ఈ జిల్లాలో తుంగభద్ర నది, కెసి కెనాల్, సమ్మర్ స్టోరేజ్, బాలసాయి స్కూల్ అనువైన ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. అంతేకాదు కర్నూలులో 12 ఎకరాల్లో ఫిలిం సిటీగా అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నామని చెప్పారు.
సినిమా హబ్ గా కర్నూలు: జిల్లాలో సినిమాలు తీస్తే 20% రాయితీ లభించనున్నదని.. ఇందులో భాగంగా ఇక నుంచి కర్నూలు లో సినిమా తీయాలని నిర్ణయించామని చెప్పారు. ఇదే విషయంపై ఉగాది పండగ అనంతరం సినిమా పెద్దలంతా ప్రభుత్వ పెద్దలను కలుస్తారని టాలీవుడ్ సినీ నిర్మాత కేఎస్ రామారావు చెప్పారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రామారావు అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు.
Also Read:
RGV: పునీత్ రాజ్‌కుమార్ సమాధిని సందర్శించిన వర్మ.. ఆయన లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ..