Kanguva: సూర్య సినిమా కోసం ఏఐ టెక్నాలజీ.. ఏకంగా ఎనిమిది భాషల్లో..
సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు తెలుగు లోనూ మంచి విజయాలను రాబడుతుంటాయి. గజినీ సినిమా నుంచి సూర్య క్రేజ్ డబుల్ అయ్యింది. సూర్య నటించిన సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఒకే టైంలో విడుదల అవుతుంటాయి.
స్టార్ హీరో సూర్య సినిమాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. సూర్య సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ లో తెలియని ఆసక్తి ఉంటుంది. సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు తెలుగు లోనూ మంచి విజయాలను రాబడుతుంటాయి. గజినీ సినిమా నుంచి సూర్య క్రేజ్ డబుల్ అయ్యింది. సూర్య నటించిన సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఒకే టైంలో విడుదల అవుతుంటాయి. ఇక సూర్య ఇప్పుడు కంగువ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ మూవీలో ఒక పాత్రలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.
కంగువ మూవీ నిర్మాత జ్ఞానవేల్ ఇచ్చిన అప్‌డేట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కంగువ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాను భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిశా పఠానీ, బాబీ డియోల్, కోవై సరళ, యోగి బాబు, రెడ్టిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణియన్, జగపతి బాబు, కెఎస్ రవికుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కంగువతో పాటు సూర్య 44 అనే సినిమాలోనూ నటిస్తున్నాడు.
10కి పైగా భాషల్లో త్రీడీ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సూర్య 13 డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని గత పొంగల్‌లోనే విడుదల చేయాలని భావించారు. అయితే సెట్‌లో సూర్యకు చిన్న గాయం కావడంతో అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి చేయలేకపోయాడు. దాంతో విడుదల వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజాగా నిర్మాత జ్ఞానవేల్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు సిరుత్తై శివ సూర్య కోసం ఒక భయంకరమైన టైటిల్ కార్డ్‌ను డిజైన్ చేశారు. అలాగే ఈ సినిమా కోసం సూర్య స్వయంగా 8 భాషల్లో తన గాత్రాన్ని అందించాడు. మేము ఇతర భాషలలో AI టెక్నాలజీ ఉపయోగిస్తున్నాము. నార్త్ ఇండియాలో 3500కి పైగా థియేటర్లలో కంగువ సినిమా విడుదల కానుంది అని తెలిపారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.