తెలుగు చిత్రపరిశ్రమలో త్వరలోనే షూటింగ్స్ ఆగిపోతాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజుల నుంచి ఈ ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే నిర్మాతలు బంద్ ప్రకటించే అవకాశం ఉందని.. ఇప్పటికే వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయని.. సోమవారం నాడు బంద్ ప్రకటించే అవకాశముందన్నారు. ఇక ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. నిర్మాణ వ్యయం తగ్గించుకునే విషయంలో తమ మధ్య చర్చ జరుగుతుందని.. షూటింగ్స్ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇండస్ట్రీని కాపాడుకోవడానికి నిర్మాతలు అంతా ఒకతాటిపైకీ రావాలన్నారు.
సినిమా నిర్మాణ ఖర్చు తగ్గించుకునే విషయంలో నిర్మాతల మధ్య చర్చ జరుగుతోంది. ఈ చర్చలు ప్రారంభదశలోనే ఉన్నాయని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలిపారు. షూటింగ్స్ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. మంచి కంటెంట్‌తో సినిమాలు తీయడంపై నిర్మాతల మధ్య చర్చ జరిగిందని దిల్‌రాజు వెల్లడించారు. సినిమా టికెట్ ధరలు ప్రేక్షుకుడికి అందుబాటులో ఉండటం, ఓటీటీలో సినిమాల విడుదల అనేది 8 నుంచి 10 వారాల తర్వాత ఉంటే బాగుంటుందనే అంశంపైకూడా చర్చించామని ఆయన తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో చాలా మంది కథలు రాయడం, హీరోలు ఒప్పుకోవడం, నిర్మాతలు సినిమా తీయడం జరిగిందని దిల్‌రాజు అన్నారు. కాని ప్రేక్షకుల గురించి ఆలోచన చేయలేదని వివరించారు. ప్యాండమిక్ సమయంలో ప్రేక్షకులు బాగా ఎడ్యూకేట్ అయ్యారని, వారికి తగ్గ స్థాయిలో సినిమాలు తీస్తేనే మెప్పించగలమనే భావన నిర్మాతల్లో వ్యక్తమైందని దిల్‌రాజు తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.