పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన ఆదిపురుష్ సినిమా ఈ వేసవిలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. అంతేకాకుండా..కేజీఎప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కోసం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అదిరిపోయే న్యూస్ చెప్పారు. సలార్ తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ పౌరాణిక సినిమా చేయబోతున్నట్లు తెలిపారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “త్వరలోనే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ పౌరాణిక సినిమా రానుంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో ఓ మూవీ రానుంది. ఇవ్వన్నీ పూర్తయ్యాక ప్రభాస్ సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలో ఉంది” అని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అలాగే సలార్ సినిమా టీజర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. జూన్ లో ఆదిపురుష్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఇదే సమయంలో అంటే జూన్ నెలాఖరులో సలార్ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.