
కొన్నిసార్లు ఇండస్ట్రీలో ముందు సినిమాల తాళూకు ప్రభావం నెక్ట్స్ సినిమాలపై బాగా గట్టిగా పడుతుంది. హీరోలకు ఆ తిప్పలేవీ ఉండకపోవచ్చు కానీ నిర్మాతలకు మాత్రం ఆ తంటాలు తప్పవు. పొరపాటుగా ముందు సినిమా ఫ్లాపైందంటే.. తర్వాతి సినిమాకు ఆ నష్టాలను కాంపన్సేట్ చేయాల్సిందే. ఇప్పుడు భోళా శంకర్ విషయంలోనూ ఇదే జరుగుతుందా..? అఖిల్ ఏజెంట్ భారాన్ని భోళాతో చిరు మోస్తున్నారా..? మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు భోళా శంకర్ మాయలోనే ఉన్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం భోళా మేకర్స్‌కు కంగారు తప్పట్లేదు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌లో వచ్చిన ఏజెంట్ డిజాస్టర్ అయింది.. ఈ నష్టాల ప్రభావం భోళా శంకర్‌పై పడుతుందిప్పుడు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న నయా మూవీ భోళాశంకర్. ఈ సినిమా తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కీర్తిసురేష్ ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కనిపించనున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఈ మూవీ పై చిత్రయూనిట్ అంతా ధీమాగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్స్, ట్రైలర్ సినిమా పై అంచలనను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ వేదాళం మూవీకి రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే.
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాకు 80 కోట్లు ఖర్చు చేసినట్లు నిర్మాతలే చెప్పారు. బిజినెస్ భారీగానే చేసారు.. నష్టాలు దానికి తగ్గట్లుగానే వచ్చాయి. దాంతో ఆ నష్టాలను ఇప్పుడు భోళాతో తీర్చాల్సిన బాధ్యత నిర్మాతలపై పడింది. దాంతో బయ్యర్లకు, భోళా శంకర్ మేకర్స్‌కు సెటిల్‌మెంట్ చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.
వాల్తేరు వీరయ్య 140 కోట్లు షేర్ వసూలు చేసింది.. దాంతో భోళా బిజినెస్ కనీసం 100 కోట్ల వరకు జరగడం ఖాయం. కానీ ఏజెంట్ నష్టాలను పూడ్చేందుకు.. భోళాను కాస్త తక్కువ రేట్‌కు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇదేం కొత్తగా వస్తున్న ట్రెండ్ కాదు. గతంలోనూ దిల్ రాజు, సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతలు ఈ పద్దతిని ఫాలో అయ్యారు. మొత్తానికి ఏజెంట్‌ను తన భుజాలపై భోళా మోయబోతున్నారన్నమాట.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..