అక్షయ్ కుమార్ ‘హెలికాప్టర్ పర్యటన’..విచార‌ణ‌కు ఆదేశం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చుట్టూ వివాదం ముసురుతోంది. లాక్​డౌన్ అమలులో ఉన్న‌ప్పుడు నిబంధ‌న‌లు ఉల్లంఘించారని ఆయ‌నపై అభియోగాలు వ‌స్తున్నాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 8:25 am, Sun, 5 July 20
అక్షయ్ కుమార్ 'హెలికాప్టర్ పర్యటన'..విచార‌ణ‌కు ఆదేశం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చుట్టూ వివాదం ముసురుతోంది. లాక్​డౌన్ అమలులో ఉన్న‌ప్పుడు నిబంధ‌న‌లు ఉల్లంఘించారని ఆయ‌నపై అభియోగాలు వ‌స్తున్నాయి. ఇటీవల అక్షయ్ ముంబై నుంచి నాసిక్​కు హెలికాప్టర్​లో​ వెళ్లడమే దీనికి మెయిన్ రీజ‌న్. అయితే అక్షయ్​కు స్పెష‌ల్ ప‌ర్మిష‌న్ ఎవరిచ్చారనే దానిపై విచారణకు ఆదేశించినట్లు మహారాష్ట్ర మంత్రి చగన్ భుజ్​బల్ వెల్ల‌డించారు.

“అక్షయ్ నాసిక్ పర్యటన గురించి వార్త‌ప‌త్రిక‌ల ద్వారా వివ‌రాల‌ తెలుసుకున్నాను. అతడు ఇక్క‌డికి వ‌చ్చిన విషయం గురించి మాకైతే ముంద‌స్తు స‌మాచారం లేదు. ఈ విషయాన్ని పరిశీలిస్తాం” మంత్రి భుజ్​బల్ పేర్కొన్నారు. అయితే డాక్ట‌ర్ ని కలిసేందుకే అక్షయ్ నాసిక్​కు వచ్చారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కాగా క‌రోనా మ‌హ‌మ్మారి వీర‌విహారం చేస్తోన్న నేప‌థ్యంలో భారీ విరాళాలు ప్ర‌క‌టించి అక్ష‌య్ రియ‌ల్ హీరో అనిపించుక‌న్న విష‌యం తెలిసిందే.