
బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన టాస్క్ పుణ్యమా అని ప్రియాంక జుట్టు కట్టించుకుంది. బిగ్ బాస్ చరిత్రలో హౌస్ లో ఉన్నవారు తమ జుట్టును త్యాగం చేయాల్సి ఉంటుంది. ఎవరో ఒకరు హౌస్ లో ఉన్నవారు తమ జుట్టును త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది తమ జుట్టును కట్టించుకున్నారు . ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ప్రియాంక తన జుట్టును కట్టించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో మూడో పవర్ అస్త్ర పొందటానికి కంటెండర్లు అవ్వడానికి ప్రియాంక జైన్, అమర్ దీప్ మధ్య టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇద్దరిలో ఒకరు తమ జుట్టును కత్తిరించుకోవాలి అని చెప్పాడు బిగ్ బాస్. దాంతో అమర్ దీప్ డ్రామా చేశాడు. నా జుట్టంటే నాకు చాలా ఇష్టం నేను కట్టించుకోను అని చెప్పాడు. నా తలపై కుట్లు ఉన్నాయి అని అన్నాడు. అయితే బిగ్ బాస్ లో అమ్మాయిలైతే బేబీ కటింగ్ చేయించుకోవాలి.. అయితే ఏకంగా గుండు కొట్టించుకోవాలి అని తెలిపారు బిగ్ బాస్. దానికి అమర్ ససేమిరా అన్నాడు. నా ఫేవరేట్ హీరో రవితేజ నా జుట్టు పై చేయి పెట్టి నా జుట్టులానే ఉంది అన్నారు. నేను గుండు చేసుకోను అని తేల్చి చెప్పేసాడు.
ఇక ప్రియాంక అయితే వెంటనే ఓకే చెప్పింది. ప్రియాంక కూడా కాస్త డ్రామా ఆడింది. నా జుట్టు నాకు చాలా ఇష్టం అని ఒకసారి. మరోసారి నాకు బేబీ కటింగ్ అంటే చాలా ఇష్టం.. ఎప్పటినుంచో చేయించుకోవాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. కటింగ్ సమయంలో కనీళ్ళు కూడా పెట్టుకుంది. కానీ బేబీ కట్టింగ్ లో చాలా ముద్దుగా ఉంది ఈ భామ.
అయితే ఇప్పుడు ప్రియాంకకు కొత్త టెన్షన్ మొదలైంది. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో కటింగ్ చేయించుకున్నవాళ్లు.. అదే జుట్టును త్యాగం చేసిన వాళ్ళు విన్ అవ్వడం లేదు. బిగ్ బాస్ సీజన్ 2 నుంచి మొదలైన ఈ సంప్రదాయంలో ఇప్పటివరకు చాలా మంది తమ జుట్టును త్యాగం చేశారు. కానీ బిగ్ బాస్ విన్ అవ్వలేక పోయారు. ఇంకొంతమంది టాప్ 5 లో కూడా లేరు. బిగ్ బాస్ 2లో దీప్తి సునయన జుట్టు కత్తించుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ 3లో శివజ్యోతి, బిగ్ బాస్ 4లో దేత్తడి హారిక, బిగ్ బాస్ ఐదో సీజన్‌లో అమ్మా రాజశేఖర్ మాస్టర్, బిగ్ బాస్ఆ సీజన్‌లో వాసంతి జుట్టును కట్టించుకున్నారు. అయితే వీరెవ్వరూ బిగ్ బాస్ విన్నర్స్ కాలేకపోయారు. దాంతో ఇప్పుడు ప్రియాంకకు కూడా ఇదే సెంటిమెంట్ వర్తిస్తుందని భయపెడుతుందట.. మరి ప్రియాంక భయం నిజమవుతుందా..?
మరిన్ని బిగ్‌బాస్-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి