అందం, అభినయం ఉన్న బ్యూటీ ప్రియమణి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. హీరోయిన్ గానే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లోనూ నటిస్తూ తన సత్తా చాటుతుంది. ఈ అమ్మడు తెలుగులోనే కాదు తమిళ్ , హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ బిగినింగ్ లోతమిళ్ సినిమాల్లో ప్రియమణి ఆ తర్వాత ఇతర భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. ఇక రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్టయిన షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాలో నటించిన ప్రియమణి ఇప్పుడు మరో స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. ప్రియమణి తెలుగులోనే కాదు తమిళ్ , కన్నడ, హిందీతో పాటు మలయాళంలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రియమణి ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో నటించనున్నారని తెలుస్తుంది. మోహన్ లాల్ ‘నేరు’లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రియమణి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు మరియు నటి ప్రియమణి ఇప్పటికే ‘నెరు’ సినిమా షూటింగ్ ప్రారంభించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..