AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: గర్భంతో ఉన్నా.. అల్లు అర్జున్ ‘రాకా’ కోసం దీపిక పదుకొణె కీలక నిర్ణయం

బాలీవుడ్ నటి దీపికా పడుకొణె మళ్లీ అమ్మకానుంది. ఇప్పుడామె గర్భంతో ఉంది. అయితే ప్రస్తుతం ఆమె రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తోంది. అందులోనూ ఈ రెండూ పుల్ యాక్షన్ సినిమాలే. హీరోతో పాటు హీరోయిన్ కూడా యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

Deepika Padukone: గర్భంతో ఉన్నా.. అల్లు అర్జున్ 'రాకా' కోసం దీపిక పదుకొణె కీలక నిర్ణయం
Deepika Padukone
Basha Shek
|

Updated on: Apr 21, 2026 | 3:22 PM

Share

బాలీవుడ్ అందాల తార దీపికా పడుకొణె 2024లో దువా పదుకొణె అనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమె మళ్లీ తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ఇప్పుడామె గర్భంతో ఉంది. ఈ విషయం పట్ల దీపిక అభిమానులు హ్యాపీగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ అభిమానులు కాస్త ఆందోళన చెందుఉతన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న ‘రాకా’ సినిమాలో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. అయితే ఇప్పుడు దీపిక గర్భం ధరించడంతో రాకా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందేమోనని బన్నీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే అలాంటి టెన్షన్ అవసరం లేదంటోంది దీపిక. ‘రాకా’ .. సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ సినిమాకు అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ మూవీలో అల్లు అర్జున్ ఒక విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ‘రాకా’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ నెల మొదట్లో అర్జున్ పుట్టినరోజున ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.మరోవైపు దీపిక లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది. అయితే గర్భంతో ఉన్నప్పటికీ ‘రాకా’ సినిమా కోసం యాక్షన్‌ సీన్స్‌ చేయడానికి దీపికా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట.

నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ రాకా మూవీ షూటింగ్‌ పూర్తి చేయాలని దీపిక నిర్ణయం తీసుకుందట. ఈ విషయం దర్శకుడు అట్లీకి కూడా చెప్పడంతో.. వీలైనంత తొందరగా దీపికకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్‌ని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఇక దీపిక కోసం రాకా చిత్ర బృందం అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. సెట్‌లో ఒక వైద్యుడిని కూడా ఉంచారట. ఆయనను సంప్రదించిన తర్వాతే దీపిక షూటింగ్ కు వస్తుందట. మరి కొన్ని నెలల పాటు రాకా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండనుంది దీపిక.

ఇవి కూడా చదవండి

ఇక దీపికా ఒప్పుకున్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌ ‘కింగ్‌’. షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఇందులో కూడా దీపిక పదుకొణె పాత్రకు యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయట. వాటిని కూడా ఆమె పూర్తి చేయాలనుకుంటోందని సమాచారం. తనవల్ల షూటింగ్‌కి అంతరాయం కావొద్దనే దీపికా ఈ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం.

సినిమాలు లేట్ అవ్వకూడదన్న కారణంతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..