Hanu Man: పాన్ వరల్డ్ మూవీగా రానున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ .. ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందంటే

తొలి సినిమా' అ' తో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా కాజల్, నిత్యామీనన్, ఈషా రెబ్బా, రెజీనా కాసాండ్రా హీరోయిన్స్ గా నటించారు.

Hanu Man: పాన్ వరల్డ్ మూవీగా రానున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ .. ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందంటే
Hanuman

Updated on: Jan 10, 2023 | 7:18 AM

వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తొలి సినిమా’ అ’ తో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా కాజల్, నిత్యామీనన్, ఈషా రెబ్బా, రెజీనా కాసాండ్రా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా తర్వాత జంబిరెడ్డి సినిమాతో మరో హిట్ అందుకున్నాడు ప్రశాంత్. చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జను హీరోగా పరిచయం చేస్తూ ప్రశాంత్ తెరకెక్కించిన జాంబీరెడ్డి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి తేజ తో కలిసి సినిమా చేస్తున్నాడు. మరోసారి విభిన్నమైన కథను ఎంచుకొని సినిమా చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఇండియన్ స్క్రీన్ మీద అత్యతం శక్తివంతమైన సూపర్ హీరో హనుమంతుడిని చూపించబోతున్నాడు ప్రశాంత్. సూపర్ హీరో కథతో తెలుగులో ఇంతవరకు ఏ సినిమా రాలేదు.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే మొన్నామధ్య విడుదలైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో హాలీవుడ్ రేంజ్ మేకింగ్‌తో అదరగొట్టాడు ప్రశాంత్ . ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమను పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు ప్రశాంత్..ప్రపంచం మొత్తంగా ఈ సినిమా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇండియాతో పాటు యూఎస్ఏ, చైనా, జపాన్, యూకే, స్పెయిన్, ఆస్ట్రేలియా, జర్మనీ, శ్రీలంక, మలేషియా వంటి దేశాల్లో.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ వంటి 11 భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మే 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.