
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ప్రభాస్ సక్సెస్ సాధించాడు. వరుసగా సాహో , రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్న ప్రభాస్ సలార్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడమే కాదు ఓ రేంజ్ లో కలెక్షన్ స్ను సొంతం చేసుకుంది. సలార్ సినిమా పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే 150కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది సలార్. కేజీఎఫ్ తర్వాత సలార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు ప్రశాంత్.
అయితే ఈ సినిమా ప్రభాస్ చెప్పే డైలాగ్స్ చాలా తక్కువ.. కేవలం ఆయన ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ తోనే సలార్ మొదటి పార్ట్ ను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. అయితే ప్రభాస్ నుంచి అదిరిపోయే డైలాగ్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు. ప్రభాస్ సలార్ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సలార్ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత రెడ్డి నీల్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్స్ ఆమెను సలార్ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారు వారిలో ఓ నెటిజన్ సలార్ సినిమాలో ప్రభాస్ కు తక్కువ డైలాగ్స్ పెట్టారు ఎందుకు అని ప్రశ్నించారు. దానికి లిఖిత రెడ్డి స్పందిస్తూ.. ప్రభాస్ కటౌట్ నీడనే మిలియన్ డైలాగ్స్ తో సమానం.. అలాంటప్పుడు ఆయన ఎక్కువ డైలాగ్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని రిప్లై ఇచ్చారు. లిఖిత రెడ్డి ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Aapadaniki Salaar oka aanakattu kaadhu. Samudram. 🔥#Salaar now streaming on Netflix in Telugu, Tamil, Malayalam, and Kannada. pic.twitter.com/hN1NfrrSTO
— Netflix India South (@Netflix_INSouth) January 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.