MAA Elections: ‘మా’ ఎన్నికలు.. ఏకగ్రీవం కోసం సీనియర్ల ప్రయత్నాలు.. సరికొత్త చర్చకు తెరలేపిన ప్రకాష్ రాజ్ ట్వీట్..

|

Jul 07, 2021 | 2:04 PM

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా 'మా' ఎలక్షన్స్ ప్రచారం జోరుగా సాగుతోంది. సెప్టెంబర్‏లో జరగాల్సిన ఎన్నికలపై ఇప్పటినుంచి సినీ ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది.

MAA Elections: మా ఎన్నికలు.. ఏకగ్రీవం కోసం సీనియర్ల ప్రయత్నాలు.. సరికొత్త చర్చకు తెరలేపిన ప్రకాష్ రాజ్ ట్వీట్..
Prakash Raj
Follow us on

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ‘మా’ ఎలక్షన్స్ ప్రచారం జోరుగా సాగుతోంది. సెప్టెంబర్‏లో జరగాల్సిన ఎన్నికలపై ఇప్పటినుంచి సినీ ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది. ముఖ్యంగా ఎప్పుడూ లేనివిధంగా ఈసారి లోకల్.. నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. దీంతో ‘మా’ ఎన్నికలు అంశం హాట్‏టాపిక్‏గా మారింది. మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహ రావు, జీవిత రాజశేఖర్ పోటి చేస్తున్నట్లు ప్రకటించడంతో మా ఎన్నికలు పూర్తిగా రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించడంతోపాటు.. మీడియా సమావేశాలు నిర్వహించడం.. బహిరంగంగానే వ్యాఖ్యలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ పరిస్థితులలో సీనియర్ నటుడు మురళి మోహన్ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపాయి.

ఈసారి మా ఎన్నికలు నిర్వహించడం లేదని… ఏకగ్రీవంగా ఎన్నుకోవడాని ప్రయత్నిస్తున్నామని చెప్పడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్‏గా మారింది. ఇక మెగా కాంపౌండ్ మద్దతు ఉన్నవారికే మా అధ్యక్ష పీఠం గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో.. ఈ ఎన్నికలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ వంటి సీనియర్ నటులు చర్చలు జరిపి ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మురళి మోహన్ చెప్పడంతో ఈ ఇష్యూ ఇప్పుడు మరో చర్చకు తెరలేపింది. ఇదిలా ఉంటే.. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ వ్యక్తి అని.. మహిళలకు మర్యాద ఇవ్వడని.. మా అధ్యక్ష పదవిలో ఆయనను ఉండనివ్వమని పలువురు నటులు వాదిస్తుండగా.. సినీ పరిశ్రమలో లోకల్, నాన్ లోకల్ తారతమ్యాలు లేవని.. ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవి అన్ని విధాల అర్హుడని మరికొందరు వాదిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే.. ప్రకాష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సినీ పరిశ్రమలో మరిన్ని సందేహాలను వెలికితీసింది. ఎలక్షన్స్ ఎప్పుడు ? #Justasking అంటూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించడం పలు సందేహాలను కలిగిస్తోంది. అంటే మురళి మోహన్ చేసిన కామెంట్స్ ప్రకాష్ రాజ్‏కు నచ్చడం లేదా ? అందుకే ఇలా ఎలక్షన్స్ ఎప్పుడు ? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. దీంతో మా ఎన్నికలు ఏకగ్రీవం అనే మాటపై ప్రకాష్ రాజ్ పరోక్షంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

Also Read: Amla Benefits: వ్యాధులను తగ్గించే ఉసిరికాయలు.. రోజూ ఇలా తింటే అనారోగ్య సమస్యలు ఫసక్..

Shagufta Ali: కష్టాల్లో బుల్లితెర నటి.. కారు, నగలు అమ్ముకొని సాయం కోసం ఎదురు చూపు..