
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. ఇటీవలే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. మరోవైపు డార్లింగ్ ఫౌజీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోపాటు స్పిరిట్ మూవీలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ రివీల్ చేస్తారా ? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో ప్రకాష్ రాజ్ సైతం కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..
ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రకాష్ రాజ్ కు మనస్పర్థలు వచ్చాయని.. దీంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నాడని నెట్టింట తెగ ప్రచారం నడుస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యారు ప్రకాష్ రాజ్. స్పిరిట్ మూవీ గురించి విషపూరిత ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇంకా సినిమాలో తన షూటింగ్స్ స్టార్ట్ కాలేదని.. అంతలోనే వాట్సాప్ ఫ్యాక్టరీలో ఏవేవో కథనాలు అల్లేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మేల్కోండి.. పోయి మీ పని మీరు చూసుకోండి అంటూ ట్వీట్ చేశారు. అలాగే నవ్వుతున్న ఎమోజీలను సైతం జత చేశాడు.
ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. స్పిరిట్ చిత్రంలో ప్రకాష్ రాజ్ తో పాటు వివేక్ ఒబెరాయ్, తృప్తి డిమ్రి, కాంచన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హర్షవర్దన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయనున్నారు.
ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
To all the toxic #Fakenews peddlers…. On #Spirit the movie . We have not even started shooting for my scenes .. and you whatsup factories speculate stories . Grow up and have a life 😂😂😂😂. #justasking
— Prakash Raj (@prakashraaj) February 9, 2026
ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.