Pragya Jaiswal: అందం అభినయం ఉన్న ప్రగ్యా జైస్వాల్ ఆశలన్నీ బాలయ్య ‘అఖండ’ పైనే..

|

Jul 15, 2021 | 3:28 AM

క్రిష్ దర్శకత్వంలో వచ్చిన  సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అందాల భామ ప్రజ్ఞ జైస్వాల్.  ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు.

Pragya Jaiswal: అందం అభినయం ఉన్న ప్రగ్యా జైస్వాల్ ఆశలన్నీ బాలయ్య అఖండ పైనే..
Follow us on

Pragya Jaiswal:

క్రిష్ దర్శకత్వంలో వచ్చిన  సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అందాల భామ ప్రగ్యా జైస్వాల్.  ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు. ఇక బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయాజానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆతర్వాత మళ్లీ ఈ ముద్దుగుమ్మ మరో సినిమాలో కనిపించలేదు. అయితే సినిమాలు చేయకాపోయినప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ప్రగ్యా.  ఇక ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ కు అఖండ రూపంలో భారీ ఆఫర్ దక్కింది. నటసింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా సక్సెస్ పై ప్రగ్యా ఎన్నో ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే తిరిగి ఈ అమ్మడు సినిమాలతో టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇటీవలే విడుదలైన ‘అఖండ’ టీజర్ టాలీవుడ్ రికార్డులని తిరగరాసింది. యూట్యూబ్ లో తక్కువ సమయంలో 50 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న టీజర్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అలాగే హీరోయిన్ పూర్ణ కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. తమన్ సంగీతసారద్యం వహిస్తున్న ఈ సినిమా మే 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ.. కరోనా నేపథ్యంలో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Aha OTT: మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆహా.. వంద‌కుపైగా దేశాల్లో కోటికి చేరిన డౌన్‌లోడ్‌లు..

వెనక్కు తగ్గిన ‘నారప్ప’ టీం.. ప్రస్తుత పరిస్థితులలో వాయిదా వేస్తున్నాం అంటూ ట్వీట్..

HariTeja: పాప‌ను వీడియో కాల్‌లో చూసేదాన్ని.. పాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.. ఏమోష‌నల్ అయిన హ‌రితేజ‌.