Dude OTT : ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్నా డ్యూడ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే

లవ్‌టుడే, డ్రాగన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత హీరో ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన ‘డ్యూడ్’.. ఈ దీపావళికి విడుదలై తమిళ, తెలుగు భాషల్లో అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి ఆట నుంచి హిట్ టాక్ సాధించి.. మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

Dude OTT : ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్నా డ్యూడ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే
Dude Movie Ott

Updated on: Nov 10, 2025 | 12:09 PM

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వరుస హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా దర్శకుడిగా తెరంగేట్రం చేసిన ప్రదీప్.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. ఇప్పటికే లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో హిట్స్ అందుకున్న ప్రదీప్.. ఇప్పుడు డ్యూడ్ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమాకు కొత్త డైరెక్టర కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే మమిత కూడా తన నటనతో అందంతో ఆకట్టుకుంది.

చిరంజీవి రికార్డును రెండు రోజుల్లో బీట్ చేసిన చరణ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తండ్రి కొడుకులు

ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటూ ఇప్పటికే చాలా డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . ఇక ఫైనల్ గా డ్యూడ్ సినిమా ఓటీటీ రిలీజ్ అఫీషియల్ డేట్ వచ్చేసింది. నవంబర్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో రానుందంటూ ఎక్స్‌ వేదికగా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డ్యూడ్‌ అందుబాటులోకి రానుందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

దొరికేసింది మావ..!! పెద్ది సాంగ్‌లో ఈ చిన్నదాన్ని గమనించారా..? ఆమె ఎవరంటే

డ్యూడ్‌ సినిమా అక్టోబర్‌ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాగా ఈజీగా రూ.100 కోట్లు రాబట్టింది. ఈ సినిమా ప్రేక్షకులను.. ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా టాక్ తెచ్చుకుంది. ఇందులో ప్రదీప్ రంగనాథన్ తోపాటు మమితా బైజు, శరత్ కుమార్, రోహిణి, హృదు హరూన్, నేహా శెట్టి తదితరులు నటించారు.అంతకు ముందు ప్రదీప్ నటించిన డ్రాగన్ సినిమ్ తొలిరోజే రూ.14 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇప్పుడు డ్యూడ్ మూవీ మాత్రం వరల్డ్ వైడ్ రూ.22 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్.. కెరీర్ పీక్‌లో ఉండగానే క్యాన్సర్.. ఇప్పుడు ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.