Kalki 2898 AD: కల్కి సినిమా టికెట్ ధరలు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగాయంటే..

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటి కలిగిస్తే.. ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండడంతో ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. ఇటీవలే ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి స్టోరీ గురించి చెబుతూ వరుస వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు కల్కి సినిమా ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Kalki 2898 AD: కల్కి సినిమా టికెట్ ధరలు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగాయంటే..
Kalki 2898 AD movie
Follow us

|

Updated on: Jun 23, 2024 | 10:52 AM

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రాన్ని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. రూ.600 కోట్ల బడ్జెట్‏తో భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటి కలిగిస్తే.. ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండడంతో ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. ఇటీవలే ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి స్టోరీ గురించి చెబుతూ వరుస వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు కల్కి సినిమా ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈనెల 27 నుంచి జూలై 4 వరకు మొత్తం 8 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇటీవల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోన తెలంగాణ ప్రభుత్వం కల్కి సినిమా టికెట్ పై గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లో రూ.100 వరకు పెంచుకోవచ్చని తెలిపింది. దీంతోపాటు ఈనెల 27న ఉదయం 5.30 గంటల షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజులపాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. కల్కి మూవీ సింగిల్ స్క్రీన్ లో రూ.265, మల్టీప్లెక్స్ రూ.413గా కల్కి టికెట్ రేట్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే బెన్ ఫిట్ షో కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.377, మల్టీప్లెక్స్ రూ.495గా ఉండనున్నాయి. ఆన్ లైన్ లో బుకింగ్, త్రీడీ గ్లాస్ ఛార్జీలు అదనం. దీనిని బట్టి చూస్తే ఒక్కో టికెట్ ధర రూ.500కి మించి ఉంటుంది. మరోవైపు ఏపీలోనూ టికెట్ ధలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలు పలువురు స్టార్ హీరోహీరోయిన్స్ గెస్ట్ అప్పీరియన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.