Adipurush: ‘ఆదిపురుష్’ సెకండ్ ట్రైలర్ పై క్రేజీ అప్డేట్.. నెవర్ బిఫోర్ విజువల్స్‏తో..

|

May 31, 2023 | 8:45 PM

రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ సీతగా కనిపించనున్నారు. ఇక రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించగా.. ఈ చిత్రాన్ని టీసిరీస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ కాబోతుంది

Adipurush: ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ పై క్రేజీ అప్డేట్.. నెవర్ బిఫోర్ విజువల్స్‏తో..
Adipurush
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమా ఏరేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ సీతగా కనిపించనున్నారు. ఇక రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించగా.. ఈ చిత్రాన్ని టీసిరీస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూన్ 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా… ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో ట్రైలర్ ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ట్రైలర్ అయితే రిలీజ్ కి కొన్ని రోజులు ముందు అయితే రిలీజ్ చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా.. ఈ ట్రైలర్ కూడా నెవర్ బిఫోర్ విజువల్స్ తో గ్రాండియర్ గా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఆదిపురుష్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెన్ ను తిరుపతిలో నిర్వహించనున్నారు. వచ్చే నెల జూన్ 6న ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఈ మూవీ కోసం జై శ్రీరామ్ రాలీలు నిర్వహిస్తున్నారు ఫ్యాన్. ప్రతి శనివారం, ఆదివారం ప్రధాన నగరాల్లో బైక్ ర్యాలీలు చేస్తున్నారు ఫ్యాన్.