అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఇప్పటికే విడుదలై ఉండాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల తేదీ డిసెంబర్ 22కి వాయిదా పడింది. క్రిస్మస్ సందర్భంగా ‘సలార్’ విడుదల కానుంది. ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇలా ప్రభాస్ ‘సలార్’ సినిమా ప్రమోషన్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా ప్రభాస్ ఒక నెల సమయం కేటాయించనున్నట్లు సమాచారం. దీని ద్వారా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రీచ్ వచ్చేలా.. అవసరమైన అన్ని సన్నాహాలు చేసాడు.
ప్రభాస్ మూడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్నాడు. దాంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష’ పరాజయాల తర్వాత ప్రభాస్ చేస్తున్న సలార్. ప్రభాస్ కు ‘సలార్’ విజయం చాలా కీలకం. గత నెల మొదట్లో ప్రభాస్ యూరప్ వెళ్లినట్లు సమాచారం. అక్కడ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడు. నవంబర్ 6న ఆయన భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ‘సలార్’ నిర్మాణ సంస్థ ‘హోంబాలే ఫిల్మ్స్’ విజయ్ కిర్గందూర్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌లతో చర్చించి మూవీ ప్రమోషన్స్ పొదలు పెట్టనున్నారు.
అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజున ప్రభాస్ బయటకు వస్తారు. అని అంతా అనుకున్నారు. కానీ ఆరోజు ప్రభాస్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఆయన ఇంకా విదేశాల్లోనే ఉన్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఇండియాకు వచ్చి సినిమా ప్రమోషన్‌లో పాల్గొననున్నాడు మన డార్లింగ్. సినిమా ప్రమోషన్‌కు ప్రశాంత్ నీల్ చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ‘కేజీఎఫ్ 2’ సినిమాకు గొప్ప పబ్లిసిటీ ఇచ్చాడు. ‘సలార్’ సినిమాకి కూడా భారీ ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హిందీలో కూడా ‘సలార్’ సినిమాపై ఆసక్తి నెలకొంది. సలార్ సమయంలోనే షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ కూడా విడుదలవుతోంది. దాంతో హిందీ బెల్ట్‌లో సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్ జరపాలని ప్లాం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ , విజయ్ కిర్గందూర్ కన్నడ నుండి వచ్చారు. కాబట్టి కర్ణాటకలో కూడా సినిమాకు ప్రమోషన్ అవసరం.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..