ఒక యుద్దం రాసిన ప్రేమ కథకు.. యుద్ద వీరుడిలా ఉండే హీరో వస్తేనే బాగుంటుంది కదా..! లెఫ్‌నెంట్ రామ్ గురించి మాట్లాడడానికి ఆది పురుష్ రాముడు వస్తేనూ సూపర్ గా ఉంటుంది కదా..! అచ్చం సీతలాగే ఉన్న సీతారామం సీత గురించి డార్లింగ్ హీరో నోటి నుంచే మాటలు వేరే లెవల్ కదా..! నేషనల్ క్రష్‌ను నేషనల్ హీరోనే అడ్రస్ చేస్తే.. మామూలుగా ఉండదు కదా..! అవును..! అందుకే అన్నట్టు.. సీతారామం మూవీ టీం.. పాన్ ఇండియన్ హీరో ప్రభాస్‌ను రంగంలోకి దించేసింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా డార్లింగ్ ప్రభాస్‌ను తీసుకొస్తోంది. ఈ న్యూస్ తో ఉన్నపళంగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక డైరెక్టర్ గా మంచి పేరున్న హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం సీతారామం. అశ్వినీ దత్ ప్రొడ్యూసర్‌గా వైజయంతి మూవీస్ ప్రొడక్షన్లో నిర్మితమవుతున్న ఈ సినిమా… పాన్ ఇండియన్ లాంగ్వేజ్‌లలో ఆగస్టు 12న రిలీజ్ అవుతోంది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీయిన్లుగా నటిస్తున్నారు. రష్మికా మందన, మరో డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరో సుమంత్ కీ రోల్స్ చేస్తున్నారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. సీతారామం ప్రమోషన్ కార్యక్రమాలను పీక్ స్టేజ్‌లో కి తీసుకెళుతున్నారు ఈ మూవీ స్టార్ కాస్ట్ . టీజర్ ఈవెంట్, ట్రైలర్ ఈవెంట్ అంటూ.. రెండు మూడు రోజుల నుంచి తెగ హంగామా చేస్తున్నారు. ప్రెస్ మీట్లో పాల్గొంటూ.. కొచ్చి టూ.. వైజాగ్.. ప్రవేట్ జెట్ లో ట్రావెల్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఆ అప్డేట్స్ ను వీడియోను పోస్ట్ చేస్తున్నారు. నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. అందర్నీ తమ వైపే తిప్పుకుంటున్నారు. ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది వైజయంతీ మూవీస్. విశాఖ లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌ను మించేలా ప్లాన్ చేస్తోంది, అయితే ఈ ఈవెంట్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా వస్తున్నారనే న్యూస్ విపరీతంగా బజ్ అవుతోంది.